YSRCP - NDA: అదే జరిగితే.. పవన్ పరిస్థితేంటి..?

ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సమావేశమవుతున్నారు. జగన్ హస్తిన పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్డీయేలో చేరనున్నదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇదే జరిగితే... బీజేపీని మోస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పరిస్థితేంటి అన్న చర్చ ఏపీ రాజకీయాలలో జోరుగా నడుస్తున్నది.

news18
Updated: October 6, 2020, 11:51 AM IST
YSRCP - NDA: అదే జరిగితే.. పవన్ పరిస్థితేంటి..?
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 6, 2020, 11:51 AM IST
  • Share this:
ఇప్పటికప్పుడు ఎన్నికలేమీ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. పలువురు బీజేపీ పెద్దలతో మంతనాలు.. ప్రధానితోనూ సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. వైఎస్ఆర్సీసీ ఎన్డీయే లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్డీయే లో చేరితో వైఎస్ఆర్సీపీకి ఒక కేంద్ర మంత్రి పదవితో పాటు మరో రెండు సహాయ మంత్రుల బెర్త్ లు కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి ఊహాగానాలా..? లేక నిజంగానే చేరుతున్నారా అనే అంశం మీద అటు వైఎస్ఆర్సీపీ నేతలు గానీ, బీజేపీ నేతలు గానీ స్పష్టమైన వైఖరి వెల్లడించకపోగా.. వస్తున్న వార్తలను ఖండించనూ లేదు. అయితే జగన్.. ప్రధాని మోడీని కలుస్తున్న వేళ.. ఆంధ్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఒకవేళ జగన్.. ఎన్డీయేలో చేరితే ఇన్నాళ్లు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితేంటి..? ఆయన దారి ఎటు అని అప్పటికే జోరుగా విశ్లేషణలు మొదలయ్యాయి.

గత అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలతో పోటీపడి దారుణంగా చతికిల పడిన పవన్.. ఆనతి కాలంలోనే బీజేపీకి దగ్గరయ్యారు. ప్రధాని మోడీ ఏ కార్యక్రమం తీసుకున్నా.. దానికి మద్దతు పలికారు. ఇదే సమయంలో ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. రాష్ట్రంలో ప్రజాందోళనలు, ప్రజా సమస్యల మీద పోరాడటానికి ఇరు పక్షాలు కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నట్టుగానే కొన్ని రోజులుగా రెండు పార్టీలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఆలయాలలో విగ్రహాల ధ్వంసం వంటి వాటిపై పోరాడుతున్నాయి.

ఒకానొక సమయంలో ఆంధ్రలో కాపులను తమ దరికి చేర్చుకునేందుకు వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కూడా బీజేపీలోకి తీసుకునే అవకాశం లేకపోవలేదని విశ్లేషకులు భావించారు. అయితే.. ఉన్నట్టుండి జగన్.. ఎన్డీయే లో చేరుతున్నారనే వార్తలు రావడంతో పవన్ ఆశలపై బీజేపీ నీళ్లు చల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో ఎన్డీయేలో కీలక భాగస్వామ్య పక్షాలైన శివసేన.. శిరోమణి అకాళీదళ్ వంటి పార్టీలు దానికి దూరమైన వేళ.. ఎన్డీయే బలం కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తున్నది. బీహార్ లోనూ పరిస్థితుల మీద ఇప్పుడే అంచనా వేయడం కుదరు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో.. బీజేపీకి బలమైన మద్దతు చాలా అవసరం. ఈ క్రమంలోనే జగన్ ను చేర్చుకుంటున్నారనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ.

ఒకవేళ ఇదే జరిగితే.. పవన్ కు ఇది నిరాశ కలిగించే అంశమే. ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉన్న పార్టీని పల్లెత్తు మాటనడానికి లేదు. మరి జగన్ తో రాజకీయ శత్రుత్వం పెంచుకుంటున్న పవన్.. బీజేపీకి లొంగి ఆ పార్టీతోనే కొనసాగుతాడా లేక సొంత కుంపటి లోనే నెట్టుకొస్తాడా..? లేక గతంలో మాదిరిగా మరోసారి చంద్రబాబుకు దగ్గరవుతాడా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్
Published by: Srinivas Munigala
First published: October 6, 2020, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading