Home /News /politics /

WHAT WAS THE REASON FOR PRAKASH RAJ PRESENCE IN THE KCR MEETING WITH MAHARASHTRA CHIEF MINISTER UDDHAV THACKERAY AND NCP CHIEF SHARAD YADAV PRV

KCR meets uddhav thackeray: సీఎం కేసీఆర్​, ఉద్ధవ్​ ఠాక్రేల భేటీలో నటుడు ప్రకాశ్​రాజ్​.. దేశ రాజకీయాలు మార్చే కీలక భేటీలో ప్రకాశ్​ రాజ్​ ఎందుకున్నారు? అదే కారణమా?

కేసీఆర్​, పవార్​ భేటీలో ప్రకాశ్​రాజ్​

కేసీఆర్​, పవార్​ భేటీలో ప్రకాశ్​రాజ్​

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతోపాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ యాదవ్ లతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ప్రకాశ్​ రాజ్​ఉండటం చాలామందికి అర్ధంకాలేదు. ఆయన ఆ మీటింగ్​లో ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
తెలంగాణ సీఎం కేసీఆర్ తన పోరును జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా ఆదివారం ముంబైలో కీలక పర్యటన (KCR meets Uddhav Thackeray) చేపట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతోపాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్​ లతో కేసీఆర్ భేటీ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ముంబై చేరుకున్న తెలంగాణ సీఎం బృందానికి ముంబై మలబార్‌ హిల్స్‌లోని ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం 'వర్ష'లో ఘన స్వాగతం లభించింది. అయితే ఈ భేటీ (KCR meets Uddhav Thackeray) లో ఎవరూ ఊహించని మరో వ్యక్తి పాలుపంచుకోవడం గమనార్హం. అతనే ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj).

ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్ బృందానికి ప్రకాష్ రాజ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్‌కు టీఆర్‌ఎస్ బృందంలోని సభ్యులను కేసీఆర్ పరిచయం చేశారు. అనంతరం కేసీఆర్ బృందంతో పాటే ప్రకాష్ రాజ్ కూడా మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం వర్షా బంగ్లాకు చేరుకున్నారు. అక్కడ కేసీఆర్ బృందంతో పాటే మహారాష్ట్ర సీఎం ఆతిథ్యం స్వీకరించారు ప్రకాష్ రాజ్ (Prakash Raj). అనంతరం సీఎంలు నిర్వహించిన ప్రెస్ ‌మీట్‌లో కూడా ప్రకాష్ రాజ్ కనిపించారు. అయితే ఇక్కడ తెలుగు ప్రజలందరికి వచ్చిన అనుమానం ప్రకాశ్​ రాజ్ (Prakash Raj)​ ఎందుకు వచ్చారు అనేది. అంత పెద్ద మీటింగ్​కి ఎలాంటి సంబంధ లేని ప్రకాశ్​ రాజ్​ రావడం ఎందుకు..? అందులోనూ దేశ రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారే భేటీలో ప్రకాశ్​ రాజ్​ ఉండటం ఏంటీ అని.

బీజేపీకి వ్యతిరేకంగా పోరు..

ఒకసారి ప్రకాశ్​ రాజ్​ బ్యాక్​గ్రౌండ్​ చూస్తే.. కర్ణాటక (Karnataka)కు చెందిన నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్. బీజేపీ అంటే ఏ మాత్రం ఇష్టపడని నాయకుల్లో ఆయనా ఒకరు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. సోషలిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తిగా ప్రకాష్ రాజ్‌కు గుర్తింపు ఉంది. ఇదివరకు బెంగళూరులో గౌరీ లంకేష్ హత్యోదంతం సమయంలోనూ ఆయన నిరసన ప్రదర్శనల్లోనూ పాల్గొన్నారు.

గతంలో విపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేసిన సమయంలో దేవేగౌడతో భేటీ అయ్యారు. ఆ సమయంలో కేసీఆర్ టీమ్‌తో ప్రకాష్ రాజు కూడా ఉన్నారు. బీజేపీ వ్యతిరేకుడిగా ఉన్న ప్రకాష్ రాజ్.. కన్నడ రాజకీయ నేతలతో మంచి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే కేసీఆర్, దేవేగౌడల భేటీ వెనక ప్రకాష్ రాజ్ ముఖ్య భూమిక పోషించారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఆగిపోయాయి.

కూటమి ఏర్పాటులో ఓ చేయి వేస్తాడనేనా..

ఉద్దవ్‌తో భేటీ అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో కూడా కేసీఆర్‌తో పాటే ప్రకాష్ రాజ్ కనిపించారు. సీఎం ఉద్దవ్‌, శివసేన కీలక నేత సంజయ్ రావుత్​లు.. కేసీఆర్‌‌ కారు వద్దకు వచ్చి వీడ్కొలు పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ బయలుదేరిన కారులోనే ప్రకాష్ రాజ్‌ కూడా ఉన్నారు. ఈ పరిణామాలు గమనిస్తే బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటులో తన వంతు సాయం అందిస్తాడని రాజకీయా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీపై ఆయనకున్న వ్యతిరేకత ఈ భేటీలో కేసీఆర్ వెంట నడిచేలా చేశాయనే టాక్ వినిపిస్తోంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: CM KCR, Mumbai, Prakash Raj, Sharad Pawar, Uddhav Thackeray

తదుపరి వార్తలు