ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రేమే మిగిలి ఉండడంతో వైసీపీ శ్రేణుల్లో అధికారంపై గంపెడు ఆశాలు పెట్టుకున్నారు. జగన్ ఈ సారీ ముఖ్యమంత్రి అయితేనే పార్టీకి భవిష్యత్ అని భావిస్తోన్న పార్టీ శ్రేణులు మరో కొత్త ప్రతిపాదన కూడా అధినేత ముందుంచినట్లు తెలుస్తోంది. పార్టీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరిక ఎంత బలంగా ఉందో అదే స్థాయిలో షర్మిలకు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని ఒక వర్గం ఇప్పటికే గట్టిగా పట్టుబడుతుంది. కీలక సమయాల్లో షర్మిల పార్టీకి అండగా ఉన్నారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. జగన్ జైలుకెళ్లిన సమయంలో పార్టీ భాద్యతను మొత్తం తనపైనే వేసుకొని పాదయాత్ర ద్వార పార్టీ విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు షర్మిల అండగా ఉన్నారు. మొన్నటికి మొన్న ఎన్నికల ప్రచారంలో జగన్ తో పాటు షర్మిళకు కూడా జోరుగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. బై బై బాబు అనే స్లోగన్ షర్మిళనే తీసుకొచ్చారు. దీంతో ఈ స్లోగన్ సోషల్ మీడియాలో ఎంత హాల్ చల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బైబై బాబు అనే స్లోగన్ ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేయడంలో బాగా పనిచేసిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి షర్మిలను ఎన్నికల బరిలోకి జగన్ దింపుతారాని అందరు భావించారు. ఒంగోలు ఎంపీ స్థానం షర్మిళకు కేటాయిస్తారని పార్టీలో కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే వాటిని ప్రచారానికే పరిమితం చేస్తూ షర్మిళను కేవలం కాంపెయిన్ స్టార్‌గా మాత్రమే వాడుకున్నారు జగన్. అయితే ఎన్నికల ఫలితాలు పార్టీకి అనుకూలంగా వస్తాయని అందరు భావిస్తోన్న నేపధ్యంలో పార్టీలో ఒక వర్గం జగన్ వద్ద ప్రతిపాదనలు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై జగన్ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా చూద్దాం అన్నట్లు పార్టీ వర్గాల సమచారం. మరోవైపు ఇప్పటికే వైసీపీ అధినేత ఒక స్పష్టమైన క్లారీటీతో ఉన్నారని పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి ఏ శాఖ కేటాయించాలనేదానిపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు జగన్‌కు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు షర్మిలకు పార్టీలో కాని ప్రభుత్వంలో కాని ఏ పోస్ట్ ఇస్తారో నిర్ణయించకపోయిన... పార్టీలో మాత్రం కీలక బాధ్యత ఇవ్వడానికి జగన్ రెడీ అవుతన్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో లోకేష్‌తో పాటు బాలయ్యకు పదవులు కట్టబెట్టడంతో పొల్చుకుంటే కుటుంబ పాలన అనే విమర్శలు పెద్దగా వచ్చే అవకాశాలు కూడా లేవని కొందరు నేతలు విశ్లేషణలు కూడా చేస్తున్నారు. అయితే అధినేత జగన్ మనసులో ఎముందో ఇంకా బయటపడాల్సిన అవసరం ఉంది. పొలింగ్ తరువాత ప్రస్తుతం కుటుంబంతో సిమ్లా విహార యాత్రలో ఉన్న జగన్ ఈ నెల 12న హైదరాబాద్ చేరుకుంటారు. వచ్చిన తరువాత అన్ని అంశాలపై ఒక స్పష్టత వస్తోందంటున్నాయి పార్టీ శ్రేణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Ys jagan mohan reddy, YS Sharmila, Ysrcp