మోదీ 2.0 : 30 రోజుల బీజేపీ పాలన సాగిందిలా..

దేశం తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో దాన్ని అధిగమించడానికి ప్రధాని మోదీ ఇటీవలే 'జల్ శక్తి మినిస్ట్రీ' ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వర్షపు నీటిని వృథా కాకుండా జాగ్రత్త పడటం, నీటి వనరులను సంరక్షించుకోవడంపై చర్యలు తీసుకోనున్నారు. 'జల్ శక్తి అభియాన్' పేరుతో సోమవారం దీనిపై క్యాంపెయిన్ ప్రారంభించారు.

news18-telugu
Updated: July 1, 2019, 8:40 PM IST
మోదీ 2.0 : 30 రోజుల బీజేపీ పాలన సాగిందిలా..
నరేంద్ర మోదీ (File)
 • Share this:
భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చి నెలరోజులు గడిచింది. ఈ నెల రోజుల్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు పడ్డాయా..? ఇప్పటివరకు తీసుకున్న కీలక నిర్ణయాలేంటి..? వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మోదీ నెల రోజుల పాలనకు సంబంధించిన హైలైట్స్ ఒకసారి పరిశీలిద్దాం..

 


 • మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్టమొదట సంతకం పెట్టిన ఫైల్ 'ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ స్కీమ్'. నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద అమలు చేస్తున్న ఈ పథకాన్ని పోలీస్ అమరవీరుల పిల్లలకు కూడా వర్తించేలా ఫైల్‌పై సంతకం చేశారు.ఉగ్రవాదులు,నక్సల్స్ దాడుల్లో వీరమరణం పొందిన పోలీసుల పిల్లలకు ఈ ఏడాది నుంచి ప్రధానమంత్రి స్కాలర్‌షిప్ స్కీమ్‌ను అమలుచేయనున్నారు.

 • దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ పెన్షన్ స్కీమ్‌ను కూడా మోదీ సర్కార్ ప్రకటించింది. తద్వారా 5కోట్ల మంది రైతులు లబ్ది పొందనున్నారు. ఇందుకోసం తొలి మూడేళ్లకు గాను రూ.10,774.50కోట్లు వెచ్చించనున్నారు. ఈ పథకానికి సంబంధించి రైతులు నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అంతే మొత్తాన్ని రైతుల తరఫున ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఎల్‌ఐసీ ద్వారా ఈ స్కీమ్‌ని కేంద్రం అమలు చేస్తుంది. అలా నెలకు రూ.100 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేల పెన్షన్ కేంద్రం అందిస్తుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులు ఈ పథకానికి అర్హులు.

 • దేశం తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో దాన్ని అధిగమించడానికి ప్రధాని మోదీ ఇటీవలే 'జల్ శక్తి మినిస్ట్రీ' ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వర్షపు నీటిని వృథా కాకుండా జాగ్రత్త పడటం, నీటి వనరులను సంరక్షించుకోవడంపై చర్యలు తీసుకోనున్నారు. 'జల్ శక్తి అభియాన్' పేరుతో సోమవారం దీనిపై క్యాంపెయిన్ ప్రారంభించారు.

 • భవిష్యత్తులో భారత ఎకానమీని 5ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్తానని మోదీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే దేశంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటికి స్వయంగా ప్రధాని మోదీయే నేత్రుత్వం వహిస్తుండటం గమనార్హం.
 • వ్యవసాయ సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు.కమిటీలో పలువురు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. వ్యవసాయ రంగంలో అవసరమైన సంస్కరణలపై కమిటీ నివేదిక అందించనుంది.

 • అవినీతి నిర్మూలనలో భాగంగా మోదీ సర్కార్ 12మంది అవినీతిపరులైన ట్యాక్స్ అధికారులను తొలగించింది. అక్రమాస్తులు,అవినీతి,లైంగిక వేధింపుల ఆరోపణలతో వారిపై వేటు వేసింది. అలాగే 15మంది కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులపై కూడా కేంద్రం వేటు వేసింది. లంచం, అవినీతి ఆరోపణలతో వారిపై వేటు వేసింది.

 • మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఎస్‌బిఎల్ గ్రూప్‌పై ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందెసర బ్రదర్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎస్‌బిఎల్ గ్రూప్ దాదాపు రూ.5700కోట్ల ఫ్రాడ్ జరిగినట్టు తేలింది.

 • పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీని అంటిగ్వా నుంచి తీసుకువచ్చేందుకు భారత్ ఆ దేశ ప్రధానితో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అతన్ని ఇండియాకు అప్పగించేందుకు అంటిగ్వా ఒప్పుకుంది. దీంతో చోక్సీ అప్పగింత కోసం భారత్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.

 • శ్రీలంకలో ఉగ్రదాడుల తర్వాత ఆ దేశంలో పర్యటించి మొట్టమొదటి విదేశీ ప్రధాని మోదీనే. పొరుగు దేశాలతో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని స్పష్టం చేయడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు.

 • బిష్కెక్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) సమ్మిట్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడిన మోదీ.. ప్రపంచ దేశాలన్నీ దీనిపై ఏకాభిప్రాయంతో ఉండాలని కోరారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, అలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడానికి లేదని ఆ సందర్భంగా అన్నారు. ఉగ్రవాదంపై మోదీ దృక్పథానికి ఇది అద్దం పడుతోంది.

 • ఇటీవల జపాన్‌లోని ఒసాకా వేదికగా జరిగిన G20 సమ్మిట్‌లో మోదీ పాల్గొన్నారు. సమ్మిట్‌లో భాగంగా 25 సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సదస్సులో పాల్గొన్న అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులతో భేటీ అయ్యారు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్టను పెంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.

First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading