జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై కొట్టడానికి కారణం ఇదేనా?

జేడీ లక్ష్మీనారాయణ,పవన్ కల్యాణ్

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున లక్ష్మీనారాయణ పోటీ చేశారు. 2,88,874 ఓట్లతో లక్ష్మీనారాయణ మూడోస్థానంలో నిలిచారు.

 • Share this:
  జనసేన పార్టీకీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడలేని విధానాల మీద అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో తన జీవితం మొత్తం ప్రజాసేవకే అని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో చేస్తుండడంతో ఆయనలో నిలకడ లేదని గుర్తించానని, అందుకే జనసేనకు రాజీనామాచేస్తున్నానని ప్రకటించారు. అయితే, జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి గుడ్ బై కొడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన తర్వాత నుంచి ఆయన జనసేనకు రాజీనామాచేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆ వాదనను లక్ష్మీనారాయణ ఖండించారు. ఓ దశలో పవన్ కళ్యాణ్, లక్ష్మీనారాయణ మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరూ కలసి విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జనసైనికుల సమావేశంలో ఒకే వేదికను పంచుకున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్ ఇవ్వాలని కూడా పిలుపునిచ్చారు. అయితే, ఇంతలోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

  AP Assembly Election Results 2019, Lok Sabha Election Result 2019 live, live Lok Sabha Election Result 2019, Lok Sabha Election Result 2019 Live Updates, Lok Sabha Election Result 2019 Live Updates, Lok Sabha Election Result, list of winners of bjp,congress,sp,bsp,jdu,rjd,tmc, bjd,aiadmk,dmk, Lok sabha election result,lok sabha chunav parinam 2019, Lok Sabha election results,loksabha chunav parinam 2019. counting day, votes counting, ap assembly election, ap assembly elections, ap assembly election 2019, ap assembly elections 2019,lok sabha elections, lok sabha election 2019, lok sabha elections 2019, chandrababu, tdp, ys jagan, ycp, pawankalyan, janasena, poll results, survey, Election Result 2019 live, Lok Sabha Election Result Today, Election Result 2019 live, Election Result 2019 Live Updates, Election Result 2019 Live Updates, Election Results 2019, election result, election result 2019, Winner, chunav parinam 2019, Lok Sabha election results, Election Result 2019 LIVE, Vidhan Sabha Chunav Parinam Today, election result, election result 2019, MLA Winner, Vidhan Sabha election results, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ, పవన్ కళ్యాణ్, జనసేన, ఎన్నికల ఫలితాలు, సర్వే, ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్, కౌంటింగ్, ఓట్ల లెక్కింపు, ఎగ్జిట్ పోల్స్ చరిత్ర, ఏపీలో టీడీపీ, ఏపీలో వైసీపీ, ఆంధ్రప్రదేశ్, అసెంబ్లీ సీటు, కౌంటింగ్ రిజల్ట్స్, రిజల్ట్, లైవ్ రిజల్ట్, కౌంటింగ్ రిజల్ట్స్,
  లక్ష్మీ నారాయణ, పవన్ కళ్యాణ్


  2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున లక్ష్మీనారాయణ పోటీ చేశారు. అయితే, అక్కడ వైసీపీ గెలుపొందింది. 2,88,874 ఓట్లతో లక్ష్మీనారాయణ మూడోస్థానంలో నిలిచారు. జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయడానికి తాజాగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కారణమనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల బీజేపీతో కలసి ముందుకు నడవాలని నిర్ణయించారు. ఎలాంటి కండిషన్లు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు.

  పవన్ కళ్యాణ్‌కు షాక్... జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై | Cbi ex jd Lakshmi Narayana quits pawan kalyan janasena party ak
  లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)


  ఇప్పటికే బీజేపీలో విశాఖ సీటు మీద ఆశలు పెట్టుకున్నవారు చాలా మందే ఉన్నారు. 2014లో అక్కడ బీజేపీ నుంచి హరిబాబు గెలిచారు. అంతకు ముందు కాంగ్రెస్ తరఫున పురందేశ్వరి విజయం సాధించారు. ప్రస్తుతం పురందేశ్వరి బీజేపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆమె విశాఖ నుంచే పోటీ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విశాఖ సీటు జనసేనకే వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ కష్టపడి పనిచేసి క్యాడర్‌ను డెవలప్ చేసుకున్నా చివరకు పొత్తుల పేరు చెప్పి విశాఖ సీటు బీజేపీ తీసుకుంటే అప్పుడు లక్ష్మీనారాయణ పరిస్థితి ఏంటి? అప్పటికప్పుడు మరో సీటు ఇస్తామంటే సీన్ ఎలా ఉంటుందో తెలీదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతే లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్లడమనేది బయటకు చెప్పే కారణమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: