• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • WHAT IS THE NEW STRATEGY OF CENTRAL GOVERNMENT ON VISKHA STEEL PLANT PRIVATIZATION NGS

Viskha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మనసు మారిందా? ఏం చేయబోతోంది?

Viskha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మనసు మారిందా? ఏం చేయబోతోంది?

విశాఖ స్టీల్ ప్లాంట్ (ఫైల్)

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తన నిర్ణయం మార్చుకుందా..? అదే జరిగితే ఏపీలో రాజకీయంగా దెబ్బ తినాల్సి వస్తుందని భయపడుతోందా..? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా..? ఇంతకీ కేంద్రం ఏం చేయబోతోంది?

 • Share this:
  విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఉత్రాంధ్రతో సహా అన్ని ప్రాంతాల నుంచి విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలో భాగమవుతున్నాయి. ఇప్పటికే సీఎం హోదాలో జగన్, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు.. ఇద్దరు నేతలూ ప్రధాని మోదీకి లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయోద్దంటూ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్యమ నినాదం ఎగసిపడుతోంది.

  స్వయంగా సీఎం జగన్ విశాఖ వెళ్లి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను కలిసి ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని.. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.. ఎప్పుడూ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని విజయసాయిరెడ్డి సైతం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్ సైతం విశాఖ వెళ్లి ఉద్యమం చేస్తున్నవారికి సంఘీభావం తెలిపారు.

  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అందరికంటే మరో అడుగు ముందుకు వేసి తన రాజీనామా లేఖను ఆమోదించాలని స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నారు. అన్ని పార్టీల నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని పిలుపు ఇచ్చారు. పవన్ సహా సినిమా ప్రముఖులంతా ఉక్కు ఉద్యమంలో కలిసిరావాలని పిలుపు ఇచ్చారు. దీంతో ఇటు బీజేపీపైనా.. మిత్రపక్షం జనసేనపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన పవన్ కేంద్రం పెద్దలతో మాట్లాడారు.. ప్రైవేటీకరణపై పునారాలోచన చేయాలని కోరారు. అటు బీజేపీ పెద్దలు సైతం ఢిల్లీలో రెండు రోజుల పాటు మఖాం వేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే రాజకీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందని వివరణ ఇచ్చారు.. ముఖ్యంగా త్వరలోనే విశాఖలో జీవీఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సాధారణ ఎన్నికలకుముందు బీజేపీ-జనసేన బలపాడలి అంటే ఈ మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలు పూర్తిగా ఇరుకున పడ్డారు. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న తిరుపతి ఉపఎన్నికపైనా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతోనే కేంద్రం కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

  స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టి.. విలీనానికి ఉన్న అవకాశాలపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒడిశాలోని సొంత గనులు కలిగిన నీలాంచల్‌ స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సొంత గనులు ఉన్నప్పటికీ భారీ నష్టాలతో మూతపడిన నీలాంచల్‌ ప్లాంట్‌ను వైజాగ్‌ స్టీల్‌లో విలీనం చేయడం ద్వారా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయొచ్చని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.

  ఒడిశాలో ఉన్న ఎన్‌.ఐ.ఎన్‌.ఎల్‌.కు సుమారు 110 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజమున్న గనులున్నాయి. అంతర్గత సమస్యలు.. భారీ నష్టాలు కారణంగా ఆ కర్మాగారం ఉత్పత్తిని నిలిపివేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో కొనసాగుతున్న ఆ సంస్థను విశాఖ ఉక్కులో విలీనం చేయాలన్న ప్రతిపాదన సుమారు పదేళ్ల కిందటే చర్చకు వచ్చింది. కానీ ఆ ప్రతిపాదన ముందుకు కదలలేదు. గనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో నీలాంచల్ ను విలీనం చేస్తే రెండు సంస్థలు లాభాలు పట్టే అవకాశం ఉందని కేంద్రం పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ భారీగా అప్పులున్న ఆ సంస్థను పునరుద్ధరించడం విశాఖ ఉక్కుకు పెనుభారంగా మారే ముప్పు లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. ఏదీ ఏమైనా ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. తిరుపతి ఉప ఎన్నికకుతోడు.. రాజకీయ పార్టీలు అన్ని ఉక్కుకు ఉద్యమానికి అండగా ఉండడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం కేంద్రానికి అంత ఈజీ కాదనే చెప్పాలి.. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
  Published by:Nagesh Paina
  First published:

  అగ్ర కథనాలు