బొమ్మరిల్లు ఫాదర్‌లా రాహుల్... సిద్ధులా జుట్టు పీక్కుంటున్న ఏపీ కాంగ్రెస్
త్వరలో ఏపీలో నిర్వహించబోయే జాతీయస్థాయి నేతల సమావేశానికి రాహుల్ వచ్చి ఎటువంటి సంకేతాలు సూచనలు ఇచ్చి వెళ్తారోనని కాంగ్రెస్ నేతలు వేచిచూస్తున్నారు.

- News18 Telugu
- Last Updated: February 12, 2019, 12:54 PM IST
ఎం.బాలకృష్ణ - సీనియర్ కరస్పాండెంట్, న్యూస్18
బొమ్మరిల్లు సినిమా అనగానే అందరికీ ఆ సినిమాలో ఫాదర్ ప్రకాష్ రాజ్ క్యారెక్టరే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నేతలకు బొమ్మరిల్లు ఫాదర్లాగానే తయారయ్యారు. రాష్ట్ర నేతల్ని రచించాల్సిన ప్రణాళికల్ని ఆయనే రచించేస్తున్నారు. వీళ్లు ఆలోచించుకునే లోపే ఆయన ఆచరణలో పెట్టేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మా చేతులు... మీ చేతుల్లోనే ఉండిపోయాయంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏం చేయాలో... ఏం చేయకూడదో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొద్ది నెలల్లో రాష్ట్రానికి ఎన్నికలు రానుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. అయితే ఇంత రాజకీయ వేడి రాజుకుంటున్న ఏపీలో కాంగ్రెస్ మాత్రం ఎక్కడా చడి చప్పుడు చేయడం లేదు. ఇప్పటికే ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ ఒక పక్కా వ్యూహాంతో ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకుంటుంటే ఏపీలో ఉందో లేదో ఉన్నట్టుగా అన్నట్లుగా మారింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పటికీ... ఇటు ఏపీలో మాత్రం పొత్తుపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇక పొత్తు ఉండదని భావించే లోపే... రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు మరోసారి ఏపీ కాంగ్రెస్ నేతలను డైలమాలో పడేశాయి. ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు రాహుల్ గాంధీ హజరై బాబుకు మద్దతివ్వడంతో ఏపీలో కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలయ్యింది. దీంతో తమ అధినేత ఏం సందేశం ఇవ్వబోతున్నారన్న అయోమయంలో పడిపోయారు నాయకులు.
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కవ నష్టపోతుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఏపీ కాంగ్రెస్ నేతలు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చూసి పిలిచి టిక్కెట్ ఇస్తామన్న ఎవరు ముందుకు వచ్చేలా లేరు. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో టీడీపీతో కలిసి పనిచేయమని తమ అధినేత సూచిస్తే ఉన్న ఆ కొద్ది క్యాడర్ కూడా ఎలా స్పందిస్తారో అనే తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే బాబు పై చాలా విమర్శలు వస్తోన్న తరుణంలో యూటర్న్ అంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలు తమ పార్టీకి కూడ నష్టాన్నిచేకూర్చే విధంగా ఉంటాయని ఏపీ కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. త్వరలో ఏపీలో నిర్వహించబోయే జాతీయస్థాయి నేతల సమావేశానికి రాహుల్ వచ్చి ఎటువంటి సంకేతాలు సూచనలు ఇచ్చి వెళ్తారోనని కాంగ్రెస్ నేతలు వేచిచూస్తున్నారు.

ఏపీ అసెంబ్లీలో వంశీ ఎక్కడ కూర్చున్నారో తెలుసా ?
Andhra Pradesh Jobs: వచ్చే నెలలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ... ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అసెంబ్లీ గేటువద్ద టీడీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు
ఏపీ అసెంబ్లీలో విద్యుత్ ఒప్పందాలపై రచ్చ
జగన్ రెండు యూటర్న్లు తీసుకున్నారా ?
నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు... చర్చకు వచ్చే అంశాలివే...

Loading...