భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రమైన సమాధానాలిచ్చారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు. ఇదే ఇంటర్వ్యూలో.. జాతీయవాదంపై మోదీ స్పందించారు. దేశంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ జాతీయవాదాన్ని ఎత్తుకుందా? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
జాతీయవాదం అంటే తన దృష్టిలో డైనమిక్‌గా వ్యవహరించడం అని మోదీ అన్నారు. 'భారత్ మాతా కీ జై' అనడం అంటే.. దేశంలోని 1.3బిలియన్ ప్రజలకు జై కొట్టడం అని చెప్పారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరుచడం జాతీయవాదం అని పేర్కొన్నారు. ఇవన్నీ జాతీయవాదం అనుకుంటే.. తాము నిజమైన జాతీయవాదులం అని మోదీ అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు లబ్ది చేకూర్చడమే జాతీయవాదం అని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Lok Sabha Election 2019, Narendra modi, New Delhi, Uttar Pradesh Lok Sabha Elections 2019