ఎన్నికల కాలం...'డిపాజిట్ గల్లంతు' అంటే ఏంటి?

Elections 2018 | సాధారణంగా ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే.. నిర్ణీత వయసుతో పాటు, డిపాజిట్ కింద రూ.10వేలు, ఎస్సీ-ఎస్టీలైతే రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: December 6, 2018, 5:01 PM IST
ఎన్నికల కాలం...'డిపాజిట్ గల్లంతు' అంటే ఏంటి?
ఈవీఎం మెషీన్
news18-telugu
Updated: December 6, 2018, 5:01 PM IST
ఎన్నికల సమయంలో నాయకులు చేసే సవాళ్లలో.. 'ఇక నీ డిపాజిట్ గల్లంతు!' అన్న వ్యాఖ్యలు తరుచూ వింటూనే ఉంటాం. అసలు ఈ డిపాజిట్ అంటే ఏమిటి?.. డిపాజిట్ దక్కించుకోవడానికి.. కోల్పోవడానికి తేడా ఏంటి?.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో 'డిపాజిట్' అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

సాధారణంగా ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే.. నిర్ణీత వయసుతో పాటు, డిపాజిట్ కింద రూ.10వేలు, ఎస్సీ-ఎస్టీలైతే రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది రీఫండబుల్. అయితే ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది. ఎవరైతే డిపాజిట్ దక్కించుకుంటారో వారికి మాత్రమే డిపాజిట్ డబ్బును తిరిగి చెల్లిస్తారు. డిపాజిట్ దక్కనివారికి రీఫండ్ చేయడం జరగదు.

డిపాజిట్ దక్కాలంటే.. మొత్తం పోలైన ఓట్లలో కనీసం 1/6 ఓట్లు సదరు అభ్యర్థికి పోల్ అవాలి. లేనిపక్షంలో సదరు అభ్యర్థి డిపాజిట్ గల్లంతు అయినట్టు లెక్క. అలాంటి సందర్భాల్లో నామినేషన్ సమయంలో అభ్యర్థి చెల్లించిన డిపాజిట్ ఖర్చును తిరిగి వెనక్కి ఇవ్వరు. సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతావారు డిపాజిట్ కోల్పోయే సందర్భాలు ఎక్కువ. సమీకరణాలు మారిపోతే కొన్నిసార్లు బడా లీడర్స్ అయినా డిపాజిట్ దక్కించుకోలేరు. ఏదేమైనా డిపాజిట్ దక్కడమనేది కాస్తయినా పరువు దక్కించుకునే వ్యవహారం. లేదూ.. డిపాజిట్ గల్లంతయ్యిందంటే అది తమకు ప్రతిష్టకు భంగంగా భావిస్తారు.


మొత్తానికి తెలంగాణలో 119 నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో 1821 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. మరి..వీరిలో ఎందరు డిపాజిట్లు దక్కించుకుంటారో? ఎందరు డిపాజిట్లు కోల్పోతారో? వేచి చూడాల్సిందే.
First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు