Home /News /politics /

WHAT CONGRESS WILL LOSS BY RESIGNATION OF JAGGAREDDY AND WHY CM KCR ALSO RELUCTENT TO TAKE JAGGA REDDY INTO TRS MKS

Jagga Reddy : జగ్గారెడ్డి రాజీనామాతో కాంగ్రెస్‌కు నష్టమెంత? CM KCR చేర్చుకోవడం కష్టమేనా? ఇదే రీజన్

కేసీఆర్, జగ్గారెడ్డి

కేసీఆర్, జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి కు జరిగే నష్టమెంత? ఆయన టీఆర్ఎస్ లో చేరలేకపోవడానికి కారణాలేంటి? సీఎం కేసీఆర్ విముఖంగా ఉన్నారనే వాదనలో నిజమెంత?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాసిన జగ్గారెడ్డి.. అందులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసాధారణ ఆరోపణలు గుప్పించారు. పీసీసీ చీఫ్ పదవి పైసలకు అమ్ముడుపోయిందని లేఖలో గట్టిగా నొక్కి చెప్పడం వల్ల జగ్గారెడ్డి ఉద్దేశపూర్వకంగానే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లయింది. తన లేఖను ఢిల్లీ పెద్దలు పట్టించుకున్నా, తేలికగా తీసుకున్నా రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదేలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు జగ్గారెడ్డి అటు టీఆర్ఎస్ లోనూ చేరలేని పరిస్థితి నెలకొన్నందున స్వతంత్రంగానే ఉంటానని, ప్రజాసేవ కొనసాగిస్తానని చెప్పుకున్నారు. జగ్గారెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ కు జరిగే నష్టమెంత? ఆయన టీఆర్ఎస్ లో చేరలేకపోవడానికి కారణాలేంటి? అంటే..

సంగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లాలో ఎదురుదెబ్బ తప్పదని, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెడ్డి ఓటర్లపైనా ఇది ప్రభావం చూపుతుందనే వాదన వినిపిస్తోంది. పార్టీని వీడటానికి జగ్గారెడ్డి చెప్పిన కారణాల్లో ప్రధానమైనవి.. తనపై కోవర్ట్ అనే ముద్ర, రేవంత్ రెడ్డి లాబీయింగ్ చేసి పీసీసీ తెచ్చుకున్నాడనే ఆరోపణ. తెలంగాణలో తిరిగి అధికారం దక్కించుకునేలా టీఆర్ఎస్ తో రాజీలేని పోరుకు పార్టీ పిలుపునివ్వగా జగ్గారెడ్డి తరచూ సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ పథకాలను పొగడటం ఆయనపై విమర్శలకు తావిచ్చింది. ‘బయటి నుంచి వచ్చిన కొందరు.. లాబీయింగ్ ద్వారా పీసీసీ పగ్గాలు కొట్టేశారు’అన్న రెండో కారణం జగ్గారెడ్డికి బూమరాంగ్ అయ్యేలా ఉందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే..

Jagga Reddy : టీకాంగ్రెస్‌లో జగ్గారెడ్డి బాంబు.. Revanth Reddy అనూహ్య స్పందన


జగ్గారెడ్డి పొలిటికల్ కెరీర్ లో ఏనాడూ నిలకడగా ఒకే పార్టీలో లేదా రెండు పార్టీల్లో ఉన్నవ్యక్తి కాదు. బీజేపీ కౌన్సిరల్ గా కెరీర్ ఆరంభించిన జగ్గారెడ్డి.. ఆ పార్టీ నుంచే సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి 2004 ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచారు. మళ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో హస్తం గుర్తుపై గెలిచారు. మళ్లీ 2014లో బీజేపీ అభ్యర్థిగా మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కెరీర్ ఆసాంతం పార్టీలు మారుతూ వచ్చిన జగ్గారెడ్డి.. కరడుగట్టిన కాంగ్రెస్ వాది వి.హనుమంతరావు లాంటి నేతలు ప్రాధేయపడినా మాటవినకపోవడం గమనార్హం. వీహెచ్ వెంట వెళ్లిన పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని పార్టీలోనే ఉండాలని కోరినా ఫలితం రాలేదు.

Vikarabad: ప్రేమించి పెళ్లాడి.. రెండేళ్ల కాపురం తర్వాత అందంగా లేవంటూ దారుణంగా వేధించడంతో..


తొలి నుంచీ కాంగ్రెస్ వాది కాని.. మధ్యలో జంపింగ్స్ చేసి వచ్చిన జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డికి హైకమాండ్ పీసీసీ పగ్గాలు ఇవ్వడాన్ని తీవ్ర స్థాయిలో సవాలు చేయడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రాజీనామాపై తగ్గేదే లేదంటోన్న జగ్గారెడ్డి ఇప్పటికిప్పుడే టీఆర్ఎస్ లో చేరబోననీ స్పష్టం చేశారు. నిజానికి సీఎం కేసీఆర్ సైతం తక్షణమే జగ్గారెడ్డిని టీఆర్ఎస్ లోకి చేర్చుకునే లేదా అనుబంధ సభ్యుడిగా కొనసాగించే అవకాశాల్లేవు. ‘మందికి పుట్టిన బిడ్డలను బీజేపీ తమ బిడ్డలుగా ముద్దాడుతోంది.. సిగ్గుండాలి..’ అని కమలదళాన్ని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనకే రివర్స్ కావడం, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అక్రమంగా కొనుక్కుందని విమర్శలు రావడం తెలిసిందే. అదీగాక..

Jagananna Vidya Deevena: విద్యార్థులకు అలర్ట్: ఎల్లుండే చివరి తేదీ.. ఇలా చేస్తేనే డబ్బులు..


కేంద్రంలో బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని గద్దెదించేదాకా నిద్రపోనని ఇటీవల భారీ శపథాలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ దిశగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల మద్దతును కూడగట్టే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన వివిధ పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఇటీవల అస్సాం బీజేపీ సీఎం హిమంత అనుచిత వ్యాఖ్యల విషయంలోనూ కేసీఆర్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించి కాంగ్రెస్ అనుకూలుడిననే హింట్ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుంటే వచ్చే లాభం కంటే అప్రతిష్టనే మూటగట్టుకోవాల్సి వస్తుందనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

Chinni Krishna : మెగా రైటర్‌పై దాడి? -పోలీసులను ఆశ్రయించిన చిన్ని కృష్ణ


సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డితోపాటు పటాన్ చెరువు, నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలున్నాయి. ఒక్క సంగారెడ్డిలో తప్ప జిల్లాలోని మిగతా నాలుగు నియోజకవర్గాల్లో జగ్గారెడ్డి ప్రభావం గతంలో పెద్దగా పనిచేసినట్లు లేదు. మరి ప్రస్తుతం రెంటికీ (కాంగ్రెస్, టీఆర్ఎస్)కు చెడ్డ రేవడిలా అయిన జగ్గారెడ్డి తిరిగి తన సొంతగూడు బీజేపీలోకి వాలిపోతారా? లేకుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పినట్లు జగ్గారెడ్డి ఉదంతం టీకప్పులో తుపానుగా, కాంగ్రెస్ కుటుంబ వ్యవహారంగా చివరికి సానుకూలంగా పరిష్కారమైపోతుందా? లేక లాబీయింగ్ వల్ల పీసీసీ దక్కిందనే ఆరోపణలపై కాంగ్రెస్ హైకమాండే జగ్గారెడ్డిపై వేటేస్తుందా? చూడాలి మరి. మొత్తంగా రాబోయే కొద్ది రోజుల్లోనే జగ్గారెడ్డి భవితవ్యంపై స్పష్టత రానుంది.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Congress, Jagga Reddy, Sangareddy, Tpcc

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు