• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • WHAT ARE THE REASONS FOR PONGULETI SRINIVAS REDDY NOT GETTING RAJYASABHA SEAT FROM TRS BA

పొంగులేటికి రాజ్యసభ సీటు దక్కకపోవడానికి ఇవే కారణాలా?

పొంగులేటికి రాజ్యసభ సీటు దక్కకపోవడానికి ఇవే కారణాలా?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Image: Facebook)

చివరి నిమిషంలో పొంగులేటిని పక్కనపెట్టి ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డికి అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావుకు మరోసారి చాన్స్ ఇచ్చారు.

  • Share this:
    ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. చివరి నిమిషం వరకు ఆయనకు రాజ్యసభ సీటు దక్కుతుందని అంతా అంచనా వేశారు. అన్ని మీడియా ఛానల్స్, పేపర్లలో కూడా పొంగులేటికి టికెట్ ఖరారైనట్టే వార్తలు వచ్చాయి. అయితే, చివరి నిమిషంలో పొంగులేటిని పక్కనపెట్టి ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డికి అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావుకు మరోసారి చాన్స్ ఇచ్చారు. అయితే, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాజ్యసభ సీటు దక్కకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని టీఆర్ఎస్ పార్టీలో, ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతోంది.

    2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ఆయన ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెంలో జలగం వెంకట్రావు, వైరాలో మదన్ లాల్ ఓటమికి ఆయన తీవ్రంగా ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ వైఖరి వల్లే ఆయనకు లోక్‌సభ టికెట్ దక్కలేదనే వాదన కూడా ఉంది. కానీ, చివరి నిమిషం వరకు ఉన్న పొంగులేటి పేరు లిస్టులో లేకపోవడంతో ఆయనకు షాక్ తగిలింది.

    Ponguleti Srinivas Reddy,Ponguleti Srinivas Reddy rajya sabha seat,Ponguleti Srinivas Reddy news,Ponguleti Srinivas Reddy khammam,Ponguleti Srinivas Reddy news,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సీటు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యూస్,ఖమ్మం పొంగులేటి,పొంగులేటి వార్తలు,
    పొంగులేటి శ్రీనివాసరెడ్డి( ఫైల్ ఫోటో)


    వ్యాపారవేత్త అయిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తెలంగాణ ప్రభుత్వంలో పలు కాంట్రాక్టులు ఉన్నాయి. సీతారామ ప్రాజెక్టు, డిండి, కాళేశ్వరంలో కొన్ని పనులు, మిషన్ భగీరథలో మరికొన్ని కాంట్రాక్టులు ఉన్నాయి. సుమారు రూ.5000 కోట్ల నుంచి రూ.6000 కోట్ల వరకు పొంగులేటికి సంబంధించిన కంపెనీ పనులు చేస్తోంది. ఈ క్రమంలో పొంగులేటికి ఇవ్వకపోయినా ఆయన పార్టీ మారాలనుకునేంత సీరియస్ నిర్ణయం తీసుకోకపోవచ్చనే ఉద్దేశంతో ఆయన పేరును కేసీఆర్ పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

    కేసీఆర్, పొంగులేటి


    మరోవైపు పొంగులేటితో టీఆర్ఎస్‌లోని అందరు రాజకీయ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్‌తో సన్నిహితంగా ఉంటారు. అలాగే, హరీశ్ రావు, ఈటల రాజేందర్ లాంటి వారితో కూడా అదే స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తారు. ఇప్పుడు కాకపోతే మరో రూపంలో అయినా కేసీఆర్ పొంగులేటికి న్యాయం చేస్తారనే అభిప్రాయం కూడా ఆయన వర్గంలో ఉంది. అదే సమయంలో రాజ్యసభ సీట్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించనంత మాత్రాన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఎవరూ నైరాశ్యానికి గురికావద్దన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా ఆలోచించిన పిదపే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పొంగులేటిని అభిమానించే ఏ ఒక్కరూ మనోస్థైర్యం కోల్పోకుండా.. సమయమనం పాటించాలని కోరారు. వాట్స్ ఆప్ గ్రూప్స్, ఫేస్ బుక్, సోషల్ మీడియాలో పార్టీ వ్యతిరేక, అభ్యంతరకర పోస్ట్ లు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: