హోమ్ /వార్తలు /రాజకీయం /

Election Results : కౌంటింగ్ టెన్షన్... ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ... సోషల్ మీడియాలో వైరల్...

Election Results : కౌంటింగ్ టెన్షన్... ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ... సోషల్ మీడియాలో వైరల్...

ఈవీఎం, వీవీప్యాట్ (File)

ఈవీఎం, వీవీప్యాట్ (File)

AP Assembly Election Results 2019 : ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు చాలా మంది ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. అవేంటో తెలుసుకుందాం.

    టీట్వంటీ మ్యాచ్‌లో ఎంత టెన్షన్ ఉంటుందో... అంతకు పది రెట్లు ఎక్కువ టెన్షన్ ఎన్నికల ఫలితాలు రిలీజయ్యేటప్పుడు ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల ఫలితాలు అందరికీ సంబంధించినవి కావడమే. ఎన్నికల సమయంలో కొంతమంది బెట్టింగ్స్ కడతారు. మరికొంతమంది తమ పార్టీ అభ్యర్థే గెలవాలని బలంగా కోరుకుంటారు. ఇంకొందరు తన ఓటు వృథా అవ్వకుండా తాను ఏ పార్టీకి వేస్తే, ఆ పార్టీయే గెలవాలని కలలు కంటారు. ఇలా ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. అందువల్ల ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు అందరూ టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా పెద్దవారు, ముసలివాళ్లు ఎక్కువ టెన్షన్ పడటం మంచిది కాదు. అలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతూ సోషల్ మీడియాలో కొన్ని అంశాలు వైరల్ అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.


    ఫలితాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

    * ప్రతీ అరగంటకోసారి మంచినీరు తాగాలి. తద్వారా టెన్షన్ తగ్గుతుంది.

    * కంటిన్యూగా ఫలితాల కోసమే చూడకుండా అప్పుడప్పుడూ పక్కనున్నవాళ్లతో మాట్లాడుతూ ఉండాలి.

    * బీపీ, షుగర్ ఉన్నవారు టాబ్లెట్లను దగ్గరగా ఉంచుకోవాలి.

    * పెద్దవారు, ముసలివాళ్లను ఇవాళ ఒంటరిగా వదిలేయకుండా, కుటుంబ సభ్యులు వారి పక్కనే ఉండాలి.

    * బెట్టింగ్స్ కాసినవారు, ఓడిపోయినా పర్వాలేదనే ధీమాతో ఉండాలి. కచ్చితంగా గెలుస్తారన్న ఆశలు పెట్టుకోకూడదు.

    * ఎవరికైనా టెన్షన్ పెరిగితే... వెంటనే వారిని చల్లటి ప్రదేశంలో ఉంచాలి. గాలి బాగా తగిలేలా చెయ్యాలి.

    * వీలైనంతవరకూ కుటుంబ సభ్యులంతా గెలుపోటములపై పాజిటివ్‌గా ఉండాలి. అభ్యర్థి గెలిచినా, ఓడినా లైట్ తీసుకోవాలి.

    * గాలి, వెలుతురూ బాగా తగిలే చోట కూర్చొని ఫలితాలు తెలుసుకోవాలి.

    * పండ్ల రసాల వంటివి పక్కనే ఉంచుకోవాలి. నీరసంగా అనిపిస్తే, అవి తాగాలి.

    * ఫైనల్ ఫలితాలు వచ్చేది సాయంత్రం తర్వాతే. అప్పటివరకూ లీడింగ్ (ఆధిక్యం) ఫలితాలు మాత్రమే వస్తాయి. అందువల్ల అతిగా టెన్షన్ పడకూడదని సూచిస్తున్నారు డాక్టర్లు.


    ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎన్నికల ఫలితాల్ని బాగా ఎంజాయ్ చెయ్యవచ్చంటున్నారు విశ్లేషకులు.

    First published:

    ఉత్తమ కథలు