జగన్ ఆఫర్‌ను రోజా కాదన్నారా? అసలేం జరిగింది?

AP Cabinet 2019 : రోజాకు స్పీకర్ పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధపడినా, సున్నితంగా తిరస్కరించారు ఆమె. మరి ఇప్పుడు జగన్ ఏం చెయ్యబోతున్నారు?

Krishna Kumar N | news18-telugu
Updated: June 8, 2019, 8:35 AM IST
జగన్ ఆఫర్‌ను రోజా కాదన్నారా? అసలేం జరిగింది?
ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్
  • Share this:
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు దక్కే పదవి ఏంటి? సీఎం జగన్ ఆలోచన ఏంటి? ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆఫర్‌ను రోజా కాదన్నారా. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి కేబినెట్ బెర్తు ఖాయమైంది. అదే సామాజిక వర్గం... అదే జిల్లాకు చెందిన రోజాకు అవకాశం లేనట్లేనా? రోజాకు జగన్ ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండగలరా. నిజానికి కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్న టైంలో సీఎం జగన్ తన పార్టీ కీలక నేత రోజాకు ఒక ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో రోజాను ఏకపక్షంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అందువల్ల అదే చంద్రబాబు ద్వారా అధ్యక్షా అని పిలిపించుకునేందుకు రోజాకు స్వీకర్ పదవి ఇస్తున్నారనే చర్చ సాగింది. జగన్ సైతం తన పార్టీ మహిళా నేతకు జరిగిన అవమానానికి సమాధానంగా... రోజాకు స్పీకర్ పదవి ఇవ్వాలని భావించి ఆ విషయమై ఆమెతో చర్చించారు. రోజా మాత్రం తాను స్పీకర్‌గా ఉండలేననీ... తాను ఎక్కువగా ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నాననీ... మంత్రిగా అవకాశం ఇవ్వాలని అభ్యర్ధిస్తూనే... చివర్లో మాత్రం మీ ఇష్టం అన్నా.. మీరు ఎలా చెబితే అలా.. అన్నారు. సరేనన్న జగన్ తానే ఫైనల్ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

పెద్దిరెడ్డికి ఖాయం..రోజాకు అదే అడ్డంకా? : చిత్తూరు జిల్లా నుంచీ సీనియర్ ఎమ్మెల్యే... తొలి నుంచీ వైసీపీకి ఆర్థికంగా... రాజకీయంగా అండగా నిలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవితో పాటూ... కీలక శాఖ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. అదే చిత్తూరు జిల్లాకు... అదే సామాజిక వర్గానికి చెందిన రోజాకు మంత్రి పదవి ఇవ్వటానికి ఈ సమీకరణలు అడ్డుగా మారాయి. దీనికి తోడు జిల్లాలో తన ప్రాధాన్యం ఉండాలని పెద్దిరెడ్డి కోరుకుంటున్నారు. జగన్ సైతం పెద్దిరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో రోజాకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. దీంతో... ఆమెకు గుర్తింపు ఇస్తూ నే కొత్త ఫార్ములా తెర మీదకు తెచ్చారు. అదే సమయంలో చిత్తూరు నుంచీ ఎస్సీ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రోజా విషయంలో మాత్రం జగన్ సానుకూలంగా ఉన్నారు.

జగన్ రాజీ ఫార్ములా ఏంటి? : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి... ఆయన కొడుకు మిధున్ రెడ్డికి లోకసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా అవకావం ఇవ్వడం ద్వారా వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చిందీ స్పష్టం చేసారు. ఇదే సమయంలో మంత్రి పదవి కావాలని ఇంతవరకూ తాను అడగలేదనీ... పార్టీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో జగన్‌కి తెలుసని రోజా అన్నారు. జగన్ సైతం రోజాకు కీలక పదవి అప్పగించే అవకాశం ఉందని తాజా సమాచారం. ఇందులో భాగంగానే.. ఈ రోజు రోజాకు ఇవ్వబోయే పదవి గురించి జగన్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు.

First published: June 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading