• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • WEST GODAWARI MAN WROTE ON HIS COMPOUND WALLS THAT HIS FAMILY VOTES ARE NOT FOR SALE AHEAD OF ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS PRN

AP Panchayat Elections: 'మా ఇంటి ఓట్లు అమ్మబడవు'... పార్టీలకు షాకిచ్చిన ఓటర్.. శభాష్ అంటున్న గ్రామస్థులు

AP Panchayat Elections: 'మా ఇంటి ఓట్లు అమ్మబడవు'... పార్టీలకు షాకిచ్చిన ఓటర్.. శభాష్ అంటున్న గ్రామస్థులు

ఓట్లు అమ్మబడవు అంటూ ఇంటి గోడపై రాయించిన కాంతారావు

AP Panchayat Elections: తాను గత ఎన్నికల సమయంలోనే ఇలా రాయించానని కాంతారావు తెలిపారు. ఓట్లు అనేవి స్వచ్ఛందంగా వేయాలని.., మంచి వ్యక్తికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పంచాచతీ ఎన్నికల హడావిడి జరుగుతోంది. ఎన్నికల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వేడిని పుట్టించాయి. తమ మార్క్ చాటాలని అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ, గట్టిపోటీ ఇవ్వాలని ప్రతిపక్ష టీడీపీ, ఉనికి చాటుకునేందుకు జనసేన-బీజేపీలు ట్రై చేస్తున్నాయి. పల్లెల్లలో తాము బలపరిచిన అభ్యర్థులే గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రలోభాలు, బెదిరింపుల పర్వాలు మొదలయ్యాయి. ఓటర్లకు తాయిలాలిచ్చి నయానో భయానో తమవైపుకు తిప్పుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కొన్నిచోట్ల గంపగుత్తగా ఓట్లను వేలంపాడి గెలుచుకుంటుంటే.. మరికొన్ని చోట్ల ఏకంగా సర్పంచ్ పదవికే వేలం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రాజకీయ పార్టీలకు, సర్పంచ్ అభ్యర్థులకు., ఓట్లు కొనేయొచ్చులే అని భావించే వారికి షాకిచ్చారు.

    పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలు పీక్స్ కు చేరుకోవడంతో నర్సాపురం మండల్లం కొప్పర్రు గ్రామానికి చెందిన కొప్పర్రు కాంతారావు అనే వ్యక్తి తన ఇంటి గోడపై ‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడువు’ అని రాశారు. అంతేకాదు గ్రామస్తులను చైతన్య పరుస్తూ, ఓటు విలువను గుర్తు చేస్తూ ఆయన రాయించిన మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ‘ప్రజలకు కత్తి చేతికివ్వలేదు.. ఓటు మక్కు ఆయుధంగా ఇచ్చారు. పోరాడి రాజులౌతారో.. ఓడిపోయి (అమ్ముకుని) బానిసలౌతారో నిర్ణయం మీ చేతిలోనే అన్నారు. ఈ ఇంటి ఓట్ల అమ్మబడవు.. ఓటు ఆయుధం.. దానిని కులం కోసమో, వర్గం కోసమో.. డబ్బు కోసమో.. వృధా చేయకండి’

    తాను గత ఎన్నికల సమయంలోనే ఇలా రాయించానని కాంతారావు తెలిపారు. ఓట్లు అనేవి స్వచ్ఛందంగా వేయాలని.., మంచి వ్యక్తికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తమ ఇంట్లో వారంతా ఓటుకి డబ్బులు తీసుకోకూడదని తీర్మానించుకున్నట్లు తెలిపారు. తన స్ఫూర్తితో గ్రామంలో చాలా మంది తమ ఇళ్ల గోడలపై ఇలాగే రాయించామన్నారు. తాము ఓట్లు అమ్ముకునేంత స్థాయికి దిగజరాలేదని ఆయన తెలిపారు.
    Published by:Purna Chandra
    First published: