హోమ్ /వార్తలు /National రాజకీయం /

Suvendu Adhikari: ఓడిపోయిన మమత సీఎం ఎందుకయ్యారు? బీజేపీ నేత సువేందు విమర్శలు

Suvendu Adhikari: ఓడిపోయిన మమత సీఎం ఎందుకయ్యారు? బీజేపీ నేత సువేందు విమర్శలు

సువేందు అధికారి, మమతా బెనర్జీ

సువేందు అధికారి, మమతా బెనర్జీ

త్వరలో ఢిల్లీకి వెళ్లి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షాను కలుస్తానని సువేందు అధికారి పేర్కొన్నారు. పార్టీ ఎందుకు ఓడిపోయింది? క్షేత్రస్థాయి పరిస్థితులు ఏంటి? అనే అంశాలను వారికి వివరిస్తాయని చెప్పారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు సువేందు అధికారి. నందిగ్రామ్‌లో నియోజకవర్గంలో మమతా బెనర్జీని ఆయన ఓడించారు. టీఎంసీ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ.. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే అక్కడ ఓడిపోయారు. ఐతే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు సువేందు అధికారి. మమతా బెనర్జీకి నైతిక విలువలు ఉంటే సీఎం పదవి చేపట్టే వారు కాదని విమర్శించారు. పీఎం కిసాన్ సాయం విషయంలో బీజేపీకి మద్దతిచ్చిన ప్రజలపై క్షక్షగట్టి.. డబ్బులు రాకుండా చేశారని మండిపడ్డారు. ఇంటర్వ్యూలో బెంగాల్ ఎన్నికలు, పీఎం కిసాన్ సాయం, హింసాత్మక ఘటనలు, నారదా స్కామ్‌పై పలు ఆసక్తికర విషయాల గురించి ఆయన మాట్లాడారు.

భవానిపూర్ ఎమ్మెల్యే సోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కదా.. మమతా బెనర్జీ అక్కడి నుంచి పోటీచేస్తారా? అని అడగ్గా.. సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోయారు. పార్టీ గెలిచినా ముఖ్యమంత్రే ఓడిపోయారు. నైతిక విలువలు ఉంటే ఆమె సీఎం పదవి చేపట్టే వారు కాదు. 1996 కేరళ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలిచినప్పటికీ సీఎం అచ్యుతానందన్ ఓడిపోయారు. మమతా బెనర్జీలా ఆయన సీఎం కుర్చీలో కూర్చోలేదు.'' అని పేర్కొన్నారు.

పీఎం కిసాన్‌ పథకానికి కేవలం టీఎంసీ నేతలు, కార్యకర్తల పేర్లను మాత్రమే పంపించారని సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్దతిచ్చే రైతులు, టీఎంసీని వ్యతిరేకించే వారికి పిఎం కిసాన్ సాయం అందకుండా కక్ష సాధింపుకు దిగారని విమర్శించారు. '' పశ్చిమ బెంగాల్ రైతులకు తొలిసారి పీఎం కిసాన్ డబ్బులు అందాయి. 2011 లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. కానీ అంతమందికీ డబ్బులు అందలేదు. 7 లక్షల మందికి మాత్రమే డబ్బులు వచ్చాయి. టీఎంసీ ప్రభుత్వం ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, వారికి ఓటు వేసే కుటంబాల వివరాలను మాత్రమే కేంద్రానికి పంపించింది. బీజేపీకి మద్దతుగా ఉన్న వారి వివరాలను పంపలేదు. అందుకే తక్కువ మందికే పీఎం కిసాన్ సాయం అందింది. ఆ సాయాన్ని కూడా మమత బెనర్జీ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్‌లో ఎలాంటి ఎన్నికలు లేవు. ఐనా ఆమె రాజకీయాలు చేస్తున్నారు.'' అని మండిపడ్డారు సువేందు అధికారి.

త్వరలో ఢిల్లీకి వెళ్లి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షాను కలుస్తానని సువేందు అధికారి పేర్కొన్నారు. పార్టీ ఎందుకు ఓడిపోయింది? క్షేత్రస్థాయి పరిస్థితులు ఏంటి? అనే అంశాలను వారికి వివరిస్తాయని చెప్పారు. నారదా కుంభకోణంలో మంత్రుల అరెస్ట్‌పై తాను స్పందించబోనని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని.. తానేమీ మాట్లాడలేనని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బలమైన ప్రతిపక్షంగా ఉంటామని.. ప్రజా సమస్యల గట్టిగా గొంతెత్తుతామని ఆయన అన్నారు. మొత్తం 77 సీట్లలో ఇద్దరు రాజీనామా చేయగా.. 75 మంది సభ్యుల బలం తమకు ఉందని తెలిపారు.

ఎన్నికల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 30 మంది బీజేపీ కార్యకర్తలు మరణించారని.. టీఎంసీ వల్లే ఈ ఘటనలు జరిగాయన్నారు సువేందు. తాము ప్రతి రోజూ 10వేల ఫిర్యాదులు చేశామని.. కొన్ని చోట్ల ఫిర్యాదు చేసే అవకాశమే లేకుండాపోయిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో హింసపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. హింసాత్మఘ ఘటనల వల్ల చాలా మంది బెంగాలీలు ఒడిశా, ఝార్ఖండ్‌కు పారిపోతున్నారని అన్నారు. మమతా బెనర్జీ పాలనలో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారని విమర్శలు గుప్పించారు సువేందు అధికారి.

First published:

Tags: Bjp, Mamata Banerjee, TMC, Trinamool congress, West Bengal

ఉత్తమ కథలు