గవర్నర్‌కు దారుణ అవమానం.. అసెంబ్లీలోకి రానీయకుండా గేటుకు తాళం..

అసెంబ్లీ వేదికగా గవర్నర్‌కు దారుణ అవమానం జరిగింది. శాసనసభలోకి రాకుండా గేటుకు తాళం వేసి అవమానించారు సిబ్బంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: December 5, 2019, 12:38 PM IST
గవర్నర్‌కు దారుణ అవమానం.. అసెంబ్లీలోకి రానీయకుండా గేటుకు తాళం..
అసెంబ్లీ వేదికగా గవర్నర్‌కు దారుణ అవమానం జరిగింది. శాసనసభలోకి రాకుండా గేటుకు తాళం వేసి అవమానించారు సిబ్బంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.
  • Share this:
ఆయన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు.. ప్రభుత్వ అధికారులు, సీఎం, మంత్రులు ఆయన తర్వాతే.. కానీ, అసెంబ్లీ వేదికగా ఆయనకు దారుణ అవమానం జరిగింది. శాసనసభలోకి రాకుండా గేటుకు తాళం వేసి అవమానించారు సిబ్బంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఈ రోజు పశ్చిమ బెంగాల్ స్పీకర్ ‌గవర్నర్‌ను మీటింగ్‌కు ఆహ్వానించారు. అయితే, గవర్నర్ జగదీప్ ధన్‌కర్ అసెంబ్లీ గేటు నంబరు 3 నుంచి లోపలికి వెళ్లేందుకు రెడీ కాగా, అక్కడున్న సిబ్బంది అప్పటికే గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో గవర్నర్ తీవ్ర అసహనానికి లోనయ్యారు.

దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్య చరిత్రకు అవమానం చేసిందని అన్నారు. తనను అసెంబ్లీలోకి రానీయకుండా గేటుకు తాళం వేశారని చెప్పారు. స్పీకర్ మీటింగ్ అని పిలిచి, చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

కాగా, పలు బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇవ్వాల్సి ఉండగా, ఆయన ఆలస్యం చేస్తున్నారని మమతా ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి నిరసనగానే ఆమె ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు