Home /News /politics /

WEST BENGAL ELECTIONS RESULTS 2021 PRASHANT KISHOR QUITS AS POLITICAL CONSULTANT EVEN AS BJP STRUGGLES TO CROSS 100 IN BENGAL SK

Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం.. బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలిచినా..

ప్రశాంత్ కిశోర్( ఫైల్ ఫోటో)

ప్రశాంత్ కిశోర్( ఫైల్ ఫోటో)

ప్రశాంత్ కిశోర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. రాజకీయాల వ్యూహాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దానిపై సీఎన్ఎన్ న్యూస్18 టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో స్పందించారు ప్రశాంత్ కిశోర్.

    ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ విజయం వెనక ఈయన పాత్ర ఎంతో కీలకమైనది. మమతా బెనర్జీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని స్పష్టం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీఎన్ఎన్ న్యూస్18తో మాట్లాడిన ఆయన.. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. భవిష్యత్‌లో ఏం చేస్తానన్నది ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. ఐతే తన సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC)లో ఎంతో మంది ప్రతిభావగల వారు ఉన్నారని.. అది యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు ప్రశాంత్ కిశోర్. తాను మాత్రం తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ కూడా రాదని కొన్ని రోజులు క్రితం ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీన్ లేదని.. ఒకవేళ బీజేపీ డబుల్ డిజిట్ దాటితే ఎన్నిల వ్యూహకర్త విధుల నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఐతే కౌంటింగ్ ప్రారంభంలో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ నెలకొంది. ప్రారంభ ట్రెండ్స్‌లో 100 స్థానాలకు పైగా లీడింగ్‌లో ఉంది బీజేపీ. దాదాపు 80 సీట్లకు పైగా కాషాయదళం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. రాజకీయాల వ్యూహాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దానిపై న్యూస్ 18 ఇంటర్వ్యూలో స్పందించారు ప్రశాంత్ కిశోర్. బెంగాల్‌లో మేమే గెలిచినప్పటికీ.. తాను ఎన్నికల వ్యూహకర్త విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.


    ఈ సందర్భంగా ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇంత పక్షపాత వైఖరి అవలంబించే ఎన్నికల సంఘాన్ని ఎక్కడా చూడలేదని.. బీజేపీకి ఈసీ మద్దతుగా ఉందని ఆరోపించారు. ఒక జిల్లాలో 20నియోజకవర్గాలు ఉంటే వాటిని నాలుగు ముక్కలు చేసి నాలుగు దశల్లో ఎన్నికలు పెట్టారుని.. ఇదంతా ఎవరి కోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ మొత్తం బీజేపీ జేబు సంస్థగా మారిపోయిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. దేశంలో ఉన్న ప్రతిపక్షాలంతా ఎన్నికల సంఘాని వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. బెంగాల్‌లో బీజేపీకి ఈసీ పూర్తిస్థాయిలో సహకారం ఇచ్చినా..మమత బెనర్జీని ఓడించలేకపోయారని విమర్శించారు ప్రశాంత్ కిశోర్.

    కాగా, ప్రశాంత్ కిశోర్ మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) సంస్థ ద్వారా ఎన్నికల్లో విజయానికి వ్యూహాలను సిద్ధం చేసేవారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పనిచేసిన మోదీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున బరిలోకి దిగి అమరీందర్ సింగ్‌ను గెలిపించారు. ఏపీలోనూ వైసీపీ విజయంలోనూ ప్రశాంత్ కిశోర్ కృషి ఉంది. ఐతే యూపీలో ఎన్నికల్లో మాత్రం ఆయన కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయారు. ఇప్పుడు బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే తరపున పనిచేసి...ఈ రెండు పార్టీలను గెలిపించారు. కానీ అంతలోనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వ్యూహాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: 5 State Elections, Prashant kishor, Tamil Nadu Assembly Elections 2021, West Bengal Assembly Elections 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు