Home /News /politics /

ఎన్నికల ర్యాలీలపై నిషేధం.. కరోనా నేపథ్యంలో ఈసీ నిర్ణయం.. బెంగాల్‌లో ఇవీ ఆంక్షలు

ఎన్నికల ర్యాలీలపై నిషేధం.. కరోనా నేపథ్యంలో ఈసీ నిర్ణయం.. బెంగాల్‌లో ఇవీ ఆంక్షలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బహిరంగ సభలపైనా ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 500 కంటే ఎక్కువ మందితో బహిరంగ సభలను నిర్వహించకూడదని స్పష్టం చేసింది. గురువారం సాయంత్రం 7 గంటల నుంచే ఈఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

    కరోనా విలయంతో యావత్ దేశం విలవిల్లాడుతోంది . పెరుగుతున్న కేసులు, మరణాలతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. మన దేశం ఎప్పుడూ కనివినీ ఎరుగనీ భయానక పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా విరుచుకుపడుతున్న వేళ ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్లాయి. మరికొన్ని రాష్ట్రాలు  నైట్ కర్ఫ్యూలతో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఐతే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విచ్చల విడిగా కరోనా నిబంధనలలను  ఉల్లంఘిస్తున్నారే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు మిగిలి ఉన్న ప్రాంతాల్లో ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది.

    అటు బహిరంగ సభలపైనా ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 500 కంటే ఎక్కువ మందితో బహిరంగ సభలను నిర్వహించకూడదని స్పష్టం చేసింది. గురువారం సాయంత్రం 7 గంటల నుంచే ఈఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ.

    కాగా, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఎన్నికల పోలింగ్ మార్చి 27న ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు ఏప్రిల్ 17న, ఆరోదశ ఎన్నికలు ఏప్రిల్ 23న ముగిశాయి. ఇక ఏడో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న, ఎనిమిదో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే మే 2న బెంగాల్ న్నికల ఫలితాలను కూడా ప్రకటిస్తారు.

    పశ్చిమ బెంగాల్‌లో గురువారం 11,948 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్న కరోనా నుంచి 6590 మంది కోలుకోగా.. మరో 56 మంది మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,00,904కి చేరింది. వీరిలో 6,21,340 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి రాష్ట్రంలో 10,766 మంది చనిపోయారు. ప్రస్తుతం బెంగాల్‌లో 68,799 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: 5 State Elections, Coronavirus, Covid-19, Kolkata, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు