Home /News /politics /

Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. సువేందు చేతిలో సీఎం మమతా బెనర్జీ ఓటమి

Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. సువేందు చేతిలో సీఎం మమతా బెనర్జీ ఓటమి

మమతా బెనర్జీ(ఫైల్ ఫొటో)

మమతా బెనర్జీ(ఫైల్ ఫొటో)

Mamata Banergee: నందిగ్రామ్‌లో ప్రజల తీర్పును శిరసావహిస్తానని చెప్పారు మమత బెనర్జీ. అతి పెద్ద పోరాటం కోసం కొన్ని త్యాగాలు చేయకతప్పదని ఓటమి అంగీకరించారు.

    పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సంచలన ట్విస్ట్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1,736 ఓట్ల మెజారిటీతో మమతపై విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. నందిగ్రామ్‌లో ప్రజల తీర్పును శిరసావహిస్తానని చెప్పారు మమత బెనర్జీ. అతి పెద్ద పోరాటం కోసం కొన్ని త్యాగాలు చేయకతప్పదని ఓటమి అంగీకరించారు. ఐతే నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ గెలిచారని మొదట వార్తలు వచ్చాయి. 1200 ఓట్లతో ఆమె విజయం సాధించారని ప్రచారం జరిగిందని. కానీ అంతలోనూ ఊహించని మలుపు తిరిగింది. మమత గెలవలేదని.. సువేందు అధికారి విజయం సాధించారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. మమతా బెనర్జీ కూడా ఒప్పుకున్నారు.

    నందిగ్రామ్‌లో మొత్తం 17 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. మొదటి ఆరు రౌండ్లలో సువేందు అధికారి లీడింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత నుంచి మమతా బెనర్జీ లీడింగ్‌లోకి వచ్చి ఆయన లీడింగ్‌ను తగ్గించారు. చివరకు 16 రౌండ్లు ముగిసేసరికి సువేందు అధికారి కేవలం 6 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. 17వ రౌండ్‌లో ఆయనకు ఏకంగా 1,1616 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా 1,622 ఓట్ల తేడాతో సీఎం మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించారు.

    ఎన్నికల ఫలితాలపై సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ''ఇంతటి ఘన విజయం అందించినందుకు బెంగాల్ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నా. వెంటనే కోవిడ్ కట్టడి పనులను ప్రారంభిస్తాం. ప్రమాణస్వీకారం కార్యక్రమం తక్కువ మంది సమక్షంలో జరుగుతుంది. బీజేపీ ఓడిపోయింది. దుర్మార్గపు రాజకీయాలు చేశారు. ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదు. నందిగ్రామ్ గురించి బాధపడకండి. ఒక ఉద్యమం కోసం నందిగ్రామ్‌లో ఎంతో పోరాడాను. ఎలాంటి తీర్పు వచ్చినా నేను స్వాగతిస్తా.'' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.



    నందిగ్రామ్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారని.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచారని బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.



    ఎన్నికల్లో బీజేపీకి అనూకూలంగా వ్యవహరించిందని ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు మమతా బెనర్జీ. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Mamata Banerjee, TMC, Trinamool congress, West Bengal, West Bengal Assembly Elections 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు