Home /News /politics /

WEST BENGAL CM MAMATHA BANERJEE HAS FOCUSED ON THE GOA ELECTIONS AND SHE ALSO SAID WHAT SHOULD BE DONE IF ANYONE IN THE STATE OF GOA WANTS TO DEFEAT THE BJP PRV

Mamatha Banerjee: గోవా ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ దూకుడు..  బీజేపీని ఓడించాలంటే ఏం చేయాలో చెప్పిన దీదీ..

గోవాలో మమతా బెనర్జీ (Photo: ANI/Twitter)

గోవాలో మమతా బెనర్జీ (Photo: ANI/Twitter)

తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Banerjee) గోవా ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గోవా రాష్ట్రంలో ఎవరైనా బీజేపీని ఓడించాలనుకుంటే ఏం చేయాలో కూడా చెప్పింది దీదీ.

    తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Banerjee) గోవా ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గోవా (Goa) ఎన్నకల ప్రచారంలో ఉన్న మమతా బెనర్జీ  "ఖేల్ జట్లో" నినాదాన్ని లేవనెత్తారు. రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో (In the Goa Assembly elections) తమ పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, గోవా రాష్ట్రంలో ఎవరైనా బీజేపీని ఓడించాలనుకుంటే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

    రెండురోజుల పాటు..

    జాతీయ పార్టీగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC)ను తీర్చిదిద్దాలన్న ప్రయత్నాల్లో ఉన్న మమత గోవాపై కన్నేశారు. రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ . గోవాలో ఇటీవలి కాలంలో మమత పర్యటించడం ఇది రెండోసారి. ఆమెతో పాటు టీఎంసీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా ఈసారి పర్యటనలో పాల్గొంటున్నారు. మమతా బెనర్జీ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గోవా ఇంటర్నేషనల్ సెంటర్‌లో గోవా టీఎంసీ నేతలతో సమావేశం నిర్వహించిన మమత ఎన్నికల వ్యూహాన్ని రచించారు.

    వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీకి ఎన్నికల కోసం (Goa Assembly elections) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలోని పురాతన ప్రాంతీయ సంస్థ - మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)తో పొత్తు పెట్టుకుంది. రెండు రోజుల గోవా పర్యటనలో ఉన్న బెనర్జీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీతో కలిసి రాష్ట్ర ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరైనా బిజెపిని ఓడించాలనుకుంటే, వారి ఇష్టానుసారం మాకు మద్దతు ఇవ్వవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు

    విపక్షాల ఓట్లను చీల్చడానికే గోవాలో టీఎంసీ పోటీ చేస్తోందన్న విమర్శలను కొట్టి పారేశారు దీదీ. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను తాము ఏకం చేస్తున్నామని, ఎవరైనా తమతో కలిసి రావచ్చని అన్నారు.

    మూడు వాగ్దానాలు..

    గోవా పర్యటనలో మమతా బెనర్జీ మూడు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇందులో ఒక సభ దక్షిణ గోవాలో జరపగా , రెండు సమావేశాలు ఉత్తర గోవాలో జరుగుతున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు మూడు వాగ్దానాలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ పథకం కింద గోవా మహిళలు నెలకు రూ. 5,000 అందిస్తామన్నారు.

    టీఎంసీ వాగ్దానం ప్రకారం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలోని మహిళలకు డబ్బులు ఇచ్చేలా తృణమూల్ ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు టిఎంసిపై విరుచుకుపడగా, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం టిఎంసిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆదివారం నాడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గోవాలో టీఎంసీ, ఆప్ మధ్య ఎలాంటి ఒప్పందం ఉండబోదని స్పష్టం చేశారు. గోవా ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Elections, Goa, Mamata Banarjee, TMC

    తదుపరి వార్తలు