కేంద్రం-మమత మధ్య ముదురుతున్న వివాదం.. దీదీ సంచలన నిర్ణయం

NITI Aayog: ప్రణాళిక సంఘాన్ని భ్రష్టుపట్టించి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారని, ఎటువంటి అధికారాలు లేని ఆ కౌన్సిల్ సమావేశానికి తాను హాజరు కాబోనని మమతా బెనర్జీ తెలిపారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 7, 2019, 2:41 PM IST
కేంద్రం-మమత మధ్య ముదురుతున్న వివాదం.. దీదీ సంచలన నిర్ణయం
మోదీ, మమత (ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్రంలోని మోదీ సర్కారు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. కొంతకాలంగా ప్రధాని మోదీ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న ఆమె మరోసారి తన నిరసన వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘాన్ని భ్రష్టుపట్టించి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారని, ఎటువంటి అధికారాలు లేని ఆ కౌన్సిల్ సమావేశానికి తాను హాజరు కాబోనని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె మోదీకి లేఖ రాశారు. ‘నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలు లేవు. రాష్ట్రాలకు ఎలాంటి ప్రాధాన్యం అందులో లభించదు. ఈ క్రమంలో జరిపే చర్చలు ఫలప్రదం కావు’ అని మమత తన లేఖలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధికై నిధులు విడుదల చేసేలా తమకు కొన్ని అధికారాలు కట్టబెట్టాలని అడిగినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ విమర్శించారు.

కాగా, ఈ నెల 15న నీతి ఆయోగ్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. అ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో వాటర్ మేనేజ్‌మెంట్, వ్యవసాయం, భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు.

First published: June 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు