• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • WEST BENGAL CM MAMATA BANERJEE LAUNCHES RS 5 MEAL SCHEME FOR POOR PEOPLE AHEAD OF ASSEMBLY ELECTIONS SU

ఎన్నికల వేళ సరికొత్త పథకం.. 5 రూపాయలకే ఎగ్ కర్రీతో కూడిన భోజనం

ఎన్నికల వేళ సరికొత్త పథకం.. 5 రూపాయలకే ఎగ్ కర్రీతో కూడిన భోజనం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్నికల ముంగిట ప్రజలపై హామీల వర్షం కురిపిస్తుంటాయి రాజకీయ పార్టీలు. ఇక, అధికారంలో ఉన్నవారైతే తిరిగి అధికారాన్ని నిలుపుకునేందకు... ప్రజలపై వరాల జల్లు కురిపిస్తారు.

  • Share this:
    ఎన్నికల ముంగిట ప్రజలపై హామీల వర్షం కురిపిస్తుంటాయి రాజకీయ పార్టీలు. ఇక, అధికారంలో ఉన్నవారైతే తిరిగి అధికారాన్ని నిలుపుకునేందకు... ప్రజలపై వరాల జల్లు కురిపిస్తారు. రాయితీలు, సంక్షేమ పథకాలతో ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. తాజాగా త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సరికొత్త పథకాన్ని తీసుకొచ్చారు. పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం అందివ్వనున్నట్టు తెలిపారు. "మా కిచెన్" పేరుతో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. రూ. 5 అందించే భోజనం ప్లేట్‌లో అన్నం, పప్పు, వెజ్ కర్రీతో పాటుగా ఎగ్ కర్రీ కూడా ఉండనుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ప్లేట్ భోజనంపై ప్రభుత్వం రూ. 15 సబ్సిడీ భరించనుందని చెప్పారు. స్వయం సహాయక గ్రూప్‌ల ద్వారా ఈ పథకాన్ని నిర్వహించనున్నారు.

    మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు రూ. 5 భోజనం కిచెన్లను తెరచి ఉంచనున్నారు. క్రమంగా రాష్ట్రంలోని ప్రతి చోట ఈ కిచెన్లను ఏర్పాటు చేయనున్నట్టు మమతా బెనర్జీ వెల్లడించారు. ప్రజలకు ఉచిత రేషన్, ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాలేనని అన్నారు. రాష్ట్రంలోని 10 కోట్ల మంది ప్రజలు స్వస్థ సాతీ కార్డు లబ్ధిదారులుగా ఉన్నారని తెలిపారు.





    ఇక, 294 స్థానాలు ఉన్న బెంగాల్‌లో అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే ఏడాది ముందు నుంచే పశ్చిమ బెంగాల్ రాజకీయ వేడి కొనసాగుతుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ బెంగాల్ ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తృణమూల్ నుంచి తమ పార్టీలోకి వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు మరోసారి బెంగాల్‌లో అధికార పీఠాన్ని కాపాడుకునేందకు మమతా బెనర్జీ కూడా సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. పేదల ఓట్లే లక్ష్యంగా మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు