• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • WEST BENGAL BJP ANNOUNCE FIRST LIST WITH 57 CANDIDATES SUVENDU ADHIKARI TO CONTEST FROM NANDIGRAM AGAINST MAMATA BANERJEE BA

పశ్చిమ బెంగాల్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన.. మమతపై పోటీకి సుబేందు

పశ్చిమ బెంగాల్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన.. మమతపై పోటీకి సుబేందు

సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి (ఫైల్ ఫొటోలు)

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ 57 మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఈ జాబితాను ప్రకటించారు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ 57 మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఈ జాబితాను ప్రకటించారు. మమతా బెనర్జీకి ఒకప్పటి అనుంగు శిష్యుడుగా, అత్యంత ఆప్తుడిగా మెలిగి.. తాజాగా బీజేపీలో చేరిన సుబేందు అధికారిని నందిగ్రామ్‌లో పోటీకి దింపుతున్నట్టు చెప్పారు. నందిగ్రామ్ లో మమతా బెనర్జీ పోటీ చేస్తుండడంతో ఆమెపై సుబేందు పోటీ చేస్తున్నారు. మమతా బెనర్జీని 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. 2007లో నందిగ్రామ్ కేంద్రంగా జరిగిన ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని అధికారంలోకి వచ్చింది మమతా బెనర్జీ. ఇప్పుడు అదే చోట దీదీ పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్ సుబేందు అధికారి సొంత ప్లేస్. తాను లోకల్ అని ఆయన చెబుతున్నారు. మమతా బెనర్జీని నమ్ముతారా? సుబేందు అధికారి గెలుస్తారా? అనేది ఇక్కడ అందరి ముందు ఉన్న ప్రశ్న.

    పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించడాని ముందు ఢిల్లీలో పెద్ద కసరత్తు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు పెద్దలు చర్చించారు. ‘మమతా బెనర్జీ త్వరలో మాజీ సీఎం అవుతున్నారు.’ అని అభ్యర్థుల ప్రకటన సందర్భంగా బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. సుబేందు అధికారి మమతా బెనర్జీ మీద భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన తండ్రి, టీఎంసీ ఎంపీ సిసిర్ అధికారి అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ మిడ్నాపూర్ హృదయాన్ని భగ్నం చేసిందన్నారు. మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేయడంపై పునరాలోచించాలన్నారు. తాను నందిగ్రామ్ భూమిపుత్రుడినని సుబేందు అధికారి అన్నారు. కాగ్రెస్, లెఫ్ట్ పార్టీలు రెండూ అసలు రేస్ లో లేవని ఆయన వ్యాఖ్యానించారు.

    మార్చి 7న బెంగాల్లో భారీ ఎత్తున సభలు, సమావేశాలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్ కతాలో జరిగే బ్రిగేడ్ ర్యాలీలో పాల్గొంటారు. ఈ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇక మమతా బెనర్జీ కూడా బీజేపీపై పోరాటంలో భాగంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్ల పెరుగుదలను నిరసిస్తూ నిరసన ర్యాలీ చేయనున్నారు. సుమారు 4.2 కిలోమీటర్ల దూరాన్ని ఆమె నడవనున్నారు. ఈ కార్యక్రమంలో అంతా మహిళలే ఉండేలా ప్లాన్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు