• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • WEST BENGAL AND ASSAM ELECTION RESULTS LIVE UPDATES IS IT MAMATA BANERJEE TMC OR NARENDRA MODI AMIT SHAH BJP SSR

Election Results 2021: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయబోతోందెవరు..? అసోంలో అధికారం ఆ పార్టీదేనా..?

మమత, మోదీ

పశ్చిమ బెంగాల్‌లో దీదీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోనున్నారా లేదా మమతను ఓడించి బెంగాల్‌లో బీజేపీ పాగా వేయనుందా అనేది నేడు తేలిపోనుంది. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ ఏ స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీఎంసీ అధినేత్రి మమత గాయమైనప్పటికీ వీల్‌చైర్‌లో కూర్చుని మరీ ప్రచారాన్ని నిర్వహించగా.. ఇక ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా బెంగాల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.

  • Share this:
    West Bengal Election Results: దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో దీదీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోనున్నారా లేదా మమతను ఓడించి బెంగాల్‌లో బీజేపీ పాగా వేయనుందా అనేది నేడు తేలిపోనుంది. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ ఏ స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీఎంసీ అధినేత్రి మమత గాయమైనప్పటికీ వీల్‌చైర్‌లో కూర్చుని మరీ ప్రచారాన్ని నిర్వహించగా.. ఇక ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా బెంగాల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.

    టీఎంసీ గెలుపునకు పీకే వ్యూహాలు, బీజేపీ గెలుపునకు అమిత్ షా ప్రణాళికలతో బెంగాల్ రాజకీయం రసవత్తరంగా సాగింది. బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బెంగాల్‌లో మళ్లీ మమతదే అధికారమని అంచనా వేయగా.. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి అధికారం దక్కే అవకాశముందని చెప్పుకొచ్చాయి.

    టైమ్స్ నౌ - సీ ఓటర్, ఈటీజీ-రీసెర్చ్, P-Marq ఎగ్జిట్ పోల్స్ బెంగాల్‌లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. 150కి పైగా సీట్లు కైవసం చేసుకుంటాయని అంచనా వేశాయి. మరోవైపు CNX-Republic Tv ఎగ్జిట్ పోల్స్‌లో టీఎంసీ 128-132 నుంచి స్థానాలు, బీజేపీ 138-148 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ విజయం సాధిస్తుందని.. 162-185 వరకు స్థానాలను ఖాతాలో వేసుకుంటుందని అంచనా వేసింది.

    Election Results 2021 Live Updates కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇక బెంగాల్‌తో పాటు ఎన్నికలు జరిగిన మరో రాష్ట్రం అసోం. అసోంలో మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. అస్సాంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 86 స్థానాల్లో విజయం సాధించింది.. అందులో బీజేపీవి గెలుపొందినవి 60 సీట్లు. అయితే ఈసారి బీజేపీ కూటమి మెజారిటీ తగ్గినప్పటికీ.. అధికారం మాత్రం నిలబెట్టుకుంటుందని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. మొత్తం 126 సీట్లలో బీజేపీ మెజారిటీ మార్కన్‌ను మించి సీట్లను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
    Published by:Sambasiva Reddy
    First published: