బీజేపీతో దోస్తీకి బీజేడీ రెడీ...మోదీకి జైకొట్టనున్న నవీన్?

మళ్లీ మోదీ సర్కార్ ప్రభుత్వమే రాబోతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో..బీజేడీ చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తాము బీజేపీతో దోస్తీ చేసేందుకు సిద్ధమేనన్న సంకేతాలను బీజేడీ పంపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Shiva Kumar Addula | news18-telugu
Updated: May 20, 2019, 7:17 PM IST
బీజేపీతో దోస్తీకి బీజేడీ రెడీ...మోదీకి జైకొట్టనున్న నవీన్?
మోదీతో నవీన్ పట్నాయక్ (ఫైల్ ఫొటో)
  • Share this:
కేంద్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. బీజేపీ కూటమికి 300లకు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేశాయి. ఈ క్రమంలో దేశంలో కూటమి రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎవరితో కలిసి వెళ్లాలి? ఎవరికి వ్యతిరేకంగా నడుచుకోవాలన్న దానిపై పార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఒడిశాలోని అధికార పార్టీ బీజేడీ (బిజూ జనతా దళ్) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒడిశా ప్రయోజనాల దృష్యా కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి తాము మద్దిస్తామని స్పష్టంచేసింది.

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీ గానీ, కూటమికి గానీ మేం మద్దతిస్తాం. ఒడిశా ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఒడిశాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం సాధిస్తాం.
అమర్ పట్నాయక్, బీజేడీ నేత
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌పైనా అనాసక్తి చూపిస్తున్నారు. తద్వారా తనది తటస్థ వైఖరని చెప్పకనే చెప్పారు.

ఐతే ఎగ్జిట్ పోల్స్ తర్వాత తన పంథా మార్చుకుంది బీజేడీ. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి మద్దతు ప్రకటించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వంలో చేరి..తమ రాష్ట్రానికి ప్రయోజనాలను చేకూర్చుకోవాలని భావిస్తోంది. మళ్లీ మోదీ సర్కార్ ప్రభుత్వమే రాబోతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో..బీజేడీ చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తాము బీజేపీతో దోస్తీ చేసేందుకు సిద్ధమేనన్న సంకేతాలను బీజేడీ పంపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
First published: May 20, 2019, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading