WE WILL REQUEST THE SPEAKER OF TELANGANA ASSEMBLY TO GIVE AIMIM THE POST OF LEADER OF OPPOSITION SAYS ASADUDDIN OWAISI SK
అసెంబ్లీలో ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: అసదుద్దీన్ ఓవైసీ
అసదుద్దీన్ ఒవైసీ
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10శాతం సీట్లు రావాలి. తెలంగాణలో మొత్తం 119 సీట్లున్నాయి. ఈ లెక్కన కనీసం 12 సీట్లున్న పార్టీకే ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ అసెంబ్లీలో ఎంఐఎంకు ఏడుగురు సభ్యులే ఉన్నారు.
తెలంగాణ సీఎల్పీ టీఆర్ఎస్లో విలీనం కావడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ బలం ఆరుకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను తాము పోషిస్తామని తెలిపారు. ఈ మేరకు త్వరలోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కలుస్తామని వెల్లడించారు.
స్పీకర్‌ని కలిసి ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరతాం. తెలంగాణలో ఎంఐఎం రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కంటే ఎంఐఎంకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిసి ఇదే విషయాన్ని వివరిస్తాం. ఆయన సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నా.
— అసదుద్దీన్ ఓవైసీ
కాంగ్రెస్‌కు చెెందిన 12 మంది ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఇటీవల సీఎల్పీని స్పీకర్ పోచారం టీఆర్ఎస్లో విలీనం చేశారు. దాంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10శాతం సీట్లు రావాలి. తెలంగాణలో మొత్తం 119 సీట్లున్నాయి. ఈ లెక్కన కనీసం 12 సీట్లున్న పార్టీకే ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ అసెంబ్లీలో ఎంఐఎంకు ఏడుగురు సభ్యులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కడం అసాధ్యం. మరి అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తిపై స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.