ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు...

AP Assembly Election Results 2019 : ఎగ్జిట్ పోల్స్‌లో పెద్దగా ప్రభావం చూపించినట్లు కనిపించని జనసేన పార్టీ... ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతోందా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనక అర్థమేంటి?

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 1:49 PM IST
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు...
పవన్ కళ్యాణ్ (Image : Janasena party / Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 1:49 PM IST
ఎప్పుడూ సంచలన కామెంట్లు చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఎవరు ఏమడిగినా ఫలితాలు వచ్చాక చూద్దామనే అన్నారు తప్ప... సంప్రదింపులు, పొత్తుల వంటి అంశాలపై ఆయన ఏదీ మాట్లాడలేదు. అలాంటిది... ఇప్పుడు మాత్రం గురువారం కౌంటింగ్ అనగా... ఇవాళ... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఆయన వ్యాఖ్యల్ని చూస్తే... రెండు కోణాలు కనిపిస్తున్నాయి. మొదటిది జనసేన పూర్తి మెజార్టీ సాధించుకొని అధికారంలోకి వస్తుందన్నది మొదటి పాయింట్. ఇది దాదాపు అసాధ్యం అని జనసేనలో నేతలకూ తెలుసు. అందువల్ల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అర్థం అది కాకపోవచ్చు.

రెండో పాయింట్ చూస్తే... మెజార్టీ స్థానాలు గెలుచుకున్న పార్టీతో జట్టు కట్టి (మద్దతు ఇస్తూ లేదా పొత్తు పెట్టుకొని) అధికారంలో భాగస్వామ్యం అవుతారన్నది కావచ్చు. ఇది కొంచెం ఆయన గత మాటలకు దగ్గరగా ఉంది. ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో తక్కువ స్థానాలు సాధించిన జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగలిగినప్పుడు... తామెందుకు ఏర్పాటు చెయ్యలేమని అన్నారు. అందువల్ల అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఇవాళ ఇలా మాట్లాడారా అన్న చర్చ జరుగుతోంది.

ప్రధానంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ ఏ పార్టీకీ మ్యాజిక్ మార్క్ (88) స్థానాలు రావనీ, అందువల్ల మూడో కీలక పార్టీగా ఉన్న తమ అవసరం తప్పని సరి అని జనసేన అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే పరిస్థితి వస్తే, ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ అయినా పవన్ కళ్యాణ్‌ను మద్దతు కోరితే, ఆయన ప్రభుత్వానికి సపోర్టుగా మద్దతు ఇస్తారా లేక, కర్ణాటకలోలాగా ఆయనే ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వమంటారా అన్నది మరో చర్చనీయ కోణం. ఇప్పటికైతే... పదవులపై ఆశలు పెట్టుకోని పవన్ కళ్యాణ్... ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం అవుతారని తెలుస్తోంది. ఇలా జరగాలంటే... ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకి మ్యాజిక్ మార్క్ స్థానాలు రాకూడదు. అదే సమయంలో ఆ పార్టీ జనసేన మద్దతు కోరాల్సి ఉంటుంది. ఈ ఈక్వేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే పవన్ ప్రభుత్వ ఏర్పాటు కామెంట్లు చేశారని తెలుస్తోంది.

చాలా సర్వేల్లో జనసేన ప్రభావం ఉండదని వచ్చినా, కొన్ని సర్వేల్లో మాత్రం జనసేన ప్రభావం కూడా ఉంటుందని వచ్చింది. అందువల్ల అదే పాజిటివ్ ఫీలింగ్‌తో తమ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ధైర్యం చెబుతున్నారు పవన్ కళ్యాణ్. మరి రిజల్ట్ ఏంటో గురువారం ఎలాగూ తెలుస్తుంది. హంగ్ ఏర్పడే పరిస్థితే వస్తే... కచ్చితంగా రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారతాయని అనుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి :

గోవాలో రష్యా మహిళపై అఘాయిత్యం... బైక్‌పై వెంటాడి... పగబట్టి...
Loading...
కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య... రాడ్లు, కర్రలు, బండరాళ్లతో....

Ola Cab : ఓలా ఆఫీస్ ఎదుట క్యాబ్ డ్రైవర్ నగ్న నిరసన...

చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర భారీ భద్రత... అసలు కారణం అదేనా...
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...