Home /News /politics /

WE WILL BRING NEW REVENUE ACT IN NEXT ASSEMBLY SESSION SK

రెవెన్యూ ఉద్యోగులకు మూడినట్లేనా..? కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

రెవెన్యూ ఉద్యోగులను చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. ఎంత బాధ ఉంటే పెట్రోల్ బాటిల్స్ పట్టుకొస్తారని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం తేస్తామని ఆయన.. కొత్త చట్టాన్ని చాలా కఠినంగా, పక్కగా అమలు చేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్.

ఇంకా చదవండి ...
  తెలంగాణలో రెవెన్యూ శాఖపై ఎన్నో విమర్శలున్నాయి. ఎమ్మార్వోలు, వీఆర్వోల పనితీరుపై రైతులు, ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా...వేలుకు వేలు లంచాలు పోసినా.. పనులు కావడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల రెవిన్యూ ఉద్యోగులపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, కొత్త రెవిన్యూ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. రెవెన్యూ ఉద్యోగులను చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. ఎంత బాధ ఉంటే పెట్రోల్ బాటిల్స్ పట్టుకొస్తారని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం తేస్తామని ఆయన.. కొత్త చట్టాన్ని చాలా కఠినంగా, పక్కగా అమలు చేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్.

  '' కొత్త రెవెన్యూ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే తెస్తాం. ప్రజలకు ఎంత బాధ ఉంటే రైతులు పెట్రోల్ బాటిల్స్ తెస్తారు. రైతులు పెట్రోల్ డబ్బా పట్టుకొని తహశీల్దార్ కార్యాలయాలకు ఎందుకొస్తున్నారు? రెవెన్యూ అధికారులే నియంత్రణ చేసుకోవాలి.  ఏదో సంఘాలు ఉన్నాయని ఎగిరి దూకుడు కాదు. మీ డిపార్ట్‌మెంట్ ఎందుకు బద్నాం అవుతుందో మీరే అంత: పరిశీలన చేసుకోవాలి. సంఘాలు ఏం చేస్తాయి? సంఘాలున్నది చావడానికా..? మంచిపని చేయాలి గానీ..! అవినీతిలో నెంబర్ వన్ ఎవరంటే రెవెన్యూ శాఖ అని తేలింది. అంత చెడ్డపేరు ఎందుకు తెచ్చుకుంటారు. అంత అంతులేని డబ్బును ఏం చేసుకుంటారు? మంచి మాటలతో ఇది పోదు. రెవిన్యూశాఖలో విచ్చలవిడితనం, అరాచకత్వం పోవాలంటే సర్జరీ అవసరం.  ఇది మందులతో పోయే పరిస్థితి లేదు. ఎవరు ఏమనుకున్నా మేం బాధపడం. ప్రజల కోసంఏమైనా చేస్తాం. పేద రైతులకు మంచి జరగడమే ముఖ్యం. ఏ రోజుకారోజు రికార్డులు అప్డేట్ కావాలి.  పటిష్టమైన ఆన్‌లైన్ వ్యవస్థ తీసుకొస్తాం. రెవిన్యూ ఉద్యోగులు ఆగం కావొద్దు. పిలిచి మాట్లాడతాం. వాళ్లు పనిచేస్తారా? వేరే శాఖకు పంపాలా? అని అభిప్రాయం తీసుకుంటాం. ఆ పని కాకుంటే వేరే పని అప్పగిస్తాం. ప్రజలు తలచుకుంటే ప్రభుత్వాలే పోతాయ్. మిమ్మల్ని తీసిపాడేసుడు ఎంత..? పిచ్చి పత్రికలు, ఛానెళ్లను చూసి ఆగం కావొద్దు. ఖచ్చితంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని కఠినంగా, పక్కాగా అమలు చేస్తాం.'' అని కేసీఆర్ అన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Telangana, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు