Home /News /politics /

WE WILL BOYCOTT ELECTIONS IF WE DONT GET AGRI LAND PASSBOOKS SAYS MADHAVAPURAM FARMERS BA

ఎన్నికలు బహిష్కరిస్తామంటున్న తెలంగాణ గ్రామం.. ఇదే వారి డిమాండ్

వివిధ కారణాలతో 89 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

వివిధ కారణాలతో 89 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

లోక్‌సభ ఎన్నికల లోపు అధికారులు తమకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని రైతన్నలు హెచ్చరించారు.

  మహబూబాబాద్ జిల్లా మాధవాపురం రైతులు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమ గ్రామంలో ఉన్న 400 రైతులకు ఇంతవరకు పట్టాదార్ పాస్ పుస్తకాలు రాలేదంటూ ఆందోళన చేపట్టారు. వెంటనే పాస్ పుస్తకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల లోపు అధికారులు తమకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని రైతన్నలు హెచ్చరించారు. ఈ మేరకు 400 మంది రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రెండు సార్లు సర్వే నిర్వహించినా.. గ్రామంలో కనీసం ఒక్క రైతుకు కూడా పట్టాదార్ పాస్ పుస్తకాలు రాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకపోవడంతో తమకు రైతుబంధు చెక్కులు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గ్రామంలో ఇద్దరు రైతులు చనిపోతే, వారికి రైతు బీమా కూడా అందలేదని తెలిపారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Farmers Protest, Lok Sabha Election 2019, Mahabubabad S29p16, Telangana Lok Sabha Elections 2019

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు