అయోధ్య తీర్పుపై రివ్యూకి వెళ్లకూడదని సున్నీ వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. కాసేపటి క్రితం అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌కు వెళ్లాలా వద్దా అన్న విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుందామనుకున్న సున్నీ వక్ఫ్ బోర్డు ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. రివ్యూ పిటిషన్ వేయాలన్న ఆలోచనను విరమించుకుంది. అంతకుముందు సుప్రీం తీర్పుపై మట్లాడుతూ సున్నీ వక్ఫ్ బోర్డు న్యాయవాది పలు వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సున్నీ వక్ఫ్ బోర్డ్ లాయర్ జాఫర్యాబ్ జిలాని.
కానీ అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామన్నారు. సుప్రీం ఇచ్చిన ఐదు ఎకరాల భూమి మాకు అత్యంత ముఖ్యమైనది కాదన్నారు. తీర్పులో అనేక అంశాలు ఉన్నాయన్నారు. శాంతి నెలకొనాలని అంతా కోరుకుంటున్నామన్నారు. తీర్పులో ప్రతీ అంశాన్ని వ్యతిరేకించడం లేదు కానీ.. కొన్ని అంశాలపై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. అయోధ్య వివాదాస్పద స్థలం రామజన్మభూమి న్యాస్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముస్లీంలకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాలు స్థలాన్ని కేటాయించింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.