'వెయిట్ అండ్ సీ'..ఎగ్జిట్ పోల్స్‌పై జనసేన లక్ష్మీనారాయణ

ఎగ్జిట్ పోల్స్‌పై జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌పై ఆందోళన చెందవద్దని..మే 23 వరకు వేచి చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: May 20, 2019, 4:10 PM IST
'వెయిట్ అండ్ సీ'..ఎగ్జిట్ పోల్స్‌పై జనసేన లక్ష్మీనారాయణ
లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో వైసీపీదే అధికారమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీమ్ సర్వే మాత్రం టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పింది. ఐతే ఏపీలో జనసేన ప్రభావం పెద్దగా లేదని, ఒకటి రెండుకు మించి ఎక్కువ స్థానాలు రావాలని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ అంచనాలపై జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌పై ఆందోళన చెందవద్దని..మే 23 వరకు వేచి చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ను నేను పట్టించుకోను. మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా నిత్యం ప్రజాసేవలోనే ఉంటా. అనవసరంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చి ప్రజల్లో మరింత ఉత్కంఠ కల్గిస్తున్నారు. ఓపికతో ఉంటే ఈ నెల 23న అసలు ఫలితమే వచ్చేస్తుంది. ఏ ఫలితం వచ్చినా ప్రజా సమస్యలపై పోరాడాలని మా పార్టీ నిర్ణయించింది. గెలుపోటములు సహజం. ప్రజల కోసం పనిచేయాలన్న భావనతో మేం ముందుకెళ్తున్నాం.
లక్ష్మీనారాయణ, జనసేన విశాఖపట్టణం ఎంపీ అభ్యర్థి
విశాఖ వన్‌టౌన్‌లో రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ని పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. కాగా, లక్ష్మీనారాయణ విశాఖపట్టణం జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
First published: May 20, 2019, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading