'రెవెన్యూ' పేరే బేకార్..'కలెక్టర్' పేరు కూడా మార్చాలి.. సీఎం కేసీఆర్ కామెంట్స్

రెవెన్యూశాఖ, కలెక్టర్ పేర్లును మార్చాల్సి ఉందన్నారు తెలంగాణ సీఎం. అవి బ్రిటిష్ హయాం నాటి పేర్లని..కలెక్షనే లేనప్పుడు కలెక్టర్ పేరెందుకని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: April 4, 2019, 6:05 PM IST
'రెవెన్యూ' పేరే బేకార్..'కలెక్టర్' పేరు కూడా మార్చాలి.. సీఎం కేసీఆర్ కామెంట్స్
కేసీఆర్ (File)
  • Share this:
తెలంగాణలో భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు సీఎం కేసీఆర్. అధునాత టెక్నాలజీతో సర్వేచేయించి భూముల పంచాయితీ లేకుండా చేస్తామని రైతులకు హామీఇచ్చారు. జులై తర్వాత ప్రతి జిల్లాకు వెళ్లి ప్రజాదర్బార్ ఏర్పాటుచేస్తామని..తానే స్వయంగా ప్రజల సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇక రెవెన్యూశాఖ, కలెక్టర్ పేర్లును మార్చాల్సి ఉందన్నారు తెలంగాణ సీఎం. అవి బ్రిటిష్ హయాం నాటి పేర్లని..కలెక్షనే లేనప్పుడు కలెక్టర్ పేరెందుకని అభిప్రాయపడ్డారు.

ఒక్క ఎకరాకు సంబంధించి కూడా భూసంబంధ కిరికిరి లేకుండాచేసే బాధ్యత నాది. ఏ భూమి ఎవరిది అనేది ధృవీకరిస్తాం. రూ.రెండు వేల కోట్లు ఖర్చుపెట్టైనా అధునాతన టెక్నాలజీతో సర్వే చేయించి భూపంచాయతీ లేకుండా చేస్తాం. ప్రతి జిల్లాలకు మూడు రోజులు స్వయంగా నేను వచ్చి ప్రజాదర్బార్ నిర్వహిస్తాం. ఎవరి భూమి ఏందో నిర్ధారణ చేసి ఇస్తాం. కన్‌క్లూజివ్ టైటిల్ (పూర్తి యాజమాన్యం) రైతులకు ఇస్తాం. ప్రభుత్వం తప్పుచేసిందని తేలితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే రెవెన్యూ చట్టాన్ని మార్చాలి.
సీఎం కేసీఆర్

అసలు రెవెన్యూ శాఖ పేరే బేకార్ పేరు. గతంలో రెవెన్యూ అంటే శిస్తు వసూలు చేసేవాళ్లు. ఇప్పుడు వసూలు ఎక్కడిది? ప్రభుత్వమే రైతులకు డబ్బులు ఇస్తోంది. కలెక్టర్ అంటే కలెక్ట్ చేసేవాడు. ఇది బ్రిటిష్ కాలంనాటి పేరు. అసలు ఇప్పుడు కలెక్షనే లేనప్పుడూ కలెక్టర్ పేరు ఎందుకు? కలెక్టర్ పేరును అలాగే ఉంచాలా? లేదంటే జిల్లా పరిపాలనా అధికారిగా పేరు మార్చాలా అని ఆలోచన చేస్తున్నాం.
సీఎం కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాలోత్ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

First published: April 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>