Piyush Goyal | ‘అందరం తప్పులు చేస్తాం’ తప్పు ఒప్పుకొన్న కేంద్ర మంత్రి

Piyush Goyal | ‘నేను న్యూటన్ అనాల్సింది పోయి ఐన్‌స్టీన్ అన్నాను. అయితే, ఐన్ స్టీన్ ఏమన్నాడంటే.. తప్పులు చేయని వాడు కొత్తగా ఏదీ కనుకొనగలేడని చెప్పాడు’ అని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: September 13, 2019, 3:14 PM IST
Piyush Goyal | ‘అందరం తప్పులు చేస్తాం’ తప్పు ఒప్పుకొన్న కేంద్ర మంత్రి
పీయూష్ గోయల్ (Image:Piyush Goyal/Twitter)
news18-telugu
Updated: September 13, 2019, 3:14 PM IST
కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన తప్పుని అంగీకరించారు. అల్బర్ ఐన్‌స్టీన్ గ్రావిటీని కనిపెట్టారంటూ ఆయన చేసిన కామెంట్ల మీద సోషల్ మీడియాలో నెటిజన్లు కేంద్ర మంత్రి మీద బీభత్సంగా జోక్స్ వేశారు. ‘భూమి ఆకర్షణ శక్తి’ని కనిపెట్టింది సర్ ఐజాక్ న్యూటన్ అయితే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పొరపాటున ఐన్‌స్టీన్ పేరు చెప్పారు. ఓ మీడియా సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై విలేకరులు ఆయన్ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న జీడీపీతో బారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎలా మారుతుందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పీయూష్ గోయల్ ‘మీరు లెక్కల్లోకి వెళ్లొద్దు. లెక్కలు వేరు. లెక్కలతో ఐన్‌స్టీన్ గ్రావిటీని కనిపెట్టలేదు.’ అని వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘నేను న్యూటన్ అనాల్సింది పోయి ఐన్‌స్టీన్ అన్నాను. అయితే, ఐన్ స్టీన్ ఏమన్నాడంటే.. తప్పులు చేయని వాడు కొత్తగా ఏదీ కనుకొనగలేడు.’ అని అభిప్రాయపడ్డారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...