చంద్రబాబుకు మరో టెన్షన్.. మాకు ‘ఆయన’ వద్దంటున్న నేతలు

ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి ఇంకా తేరుకోని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి మరో ముఖ్యమైన షాక్ తగిలింది.

news18-telugu
Updated: August 8, 2019, 4:23 PM IST
చంద్రబాబుకు మరో టెన్షన్.. మాకు ‘ఆయన’ వద్దంటున్న నేతలు
చంద్రబాబు (File)
  • Share this:
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తెలుగుదేశం పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లాలో నేతల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది. మాజీ స్పీకర్ కోడెలకు వ్యతిరేకంగా ఓ వర్గం విమర్శలు గుప్పిస్తోంది. కోడెలను పక్కన పెట్టాలని ఒత్తిడి తెస్తోంది. 2019 ఎన్నికలకు ముందే కోడెలకు సత్తెనపల్లి సీటు ఇవ్వొద్దని పార్టీ నేతలు ఒత్తిడి చేశారు. అయితే, చంద్రబాబు మాత్రం కోడెల వైపు మొగ్గుచూపారు. అయితే, ఎన్నికల్లో కోడెల ఓటమి పాలు కావడంతో ఇప్పుడు ద్వితీయశ్రేణి నాయకులు అలర్ట్ అయ్యారు. కోడెలను పక్కనపెట్టాలంటూ పార్టీ నేతలు అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సత్తెనపల్లి బాధ్యతల నుంచి కోడెలను తప్పించాలని కోరారు. ఈ క్రమంలో కోడెల నివాసంలో కొందరు నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ ఆఫీసులో రాయపాటి రంగాబాబుతో మరికొందరు భేటీ అయ్యారు. ఈ రెండు భేటీలతో టీడీపీలో ఏం జరుగుతుందో అర్ధం కాక కార్యకర్తలు తలపట్టుకుంటున్నారు. మరికొందరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించడం కష్టమని కొందరు పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వెంటనే అధిష్టానం పార్టీ బలోపేతానికి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

(రఘు అన్నా,గుంటూరు కరస్పాండెంట్,న్యూస్‌18)

First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు