Andhra Pradesh: ఆ మంత్రికి హైదరాబాద్ లో రెండిళ్లు ఉన్నాయి.. గుర్తుంచుకోవాలన్న శ్రీనివాస్ గౌడ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్(ఫైల్ ఫొటో)

ఏపీ - తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా మంత్రి కొడాలి నానిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆయనకు రెండు ఇళ్లు ఉన్నాయని.. వ్యాపారాలు చేస్తున్నారని.. ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.

  • Share this:
    తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ ముదురుతోంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. తెలంగాణ మంత్రులకు ఏపీ మంత్రులు.. మళ్లీ వాళ్లకి.. వీళ్లు కౌంటర్లు వేసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేయగా.. దానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి నానికి హైదరాబాద్‌లో రెండు ఇళ్లు ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకైనా కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా అని ప్రశ్నించారు. సి.రామచంద్రయ్య కూడా వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఇక్కడ తింటూ అక్కడి మాట మాట్లాడితే ఇక్కడి ప్రజలు మీ గురించి ఆలోచన చేస్తే పరిస్థితి ఏంటి? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తమ పదవులు పోయినా, ప్రాణాలు పోయినా ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టును అడ్డుకుంటామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

    పచ్చబడుతోన్న పాలమూరు పాలమూరు ఇప్పుడిప్పుడే పచ్చబడుతుందని ఆయన తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశతో ఉన్నారని చెప్పారు. ఆ ఆశలకు పక్క రాష్ట్రం గండికొడుతోందన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తికావాలని ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారని.. జగన్ ప్రభుత్వం వరద జలాల పేరుతో నికర జలాలను తరలిస్తోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పారు. కృష్ణా రివర్ బోర్డ్ రాయలసీమ ప్రాజెక్టును ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని మాకు ఎలా ఆదేశాలు ఇస్తారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

    తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత ఆయనది అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనడంతో వైసీపీ నేతలు మంత్రులు విరుచుకుపడుతున్నారు. దానికి సంబంధించి మంత్రుల మధ్య కౌంటర్ అటాక్ కంటిన్యూ అవుతుంది. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే రాష్ట్రం ఇలా ఉండేదికాదని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడినవారు రాజశేఖరరెడ్డి అని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి వుంటాయని కొడాలి నాని తెలిపారు. ఆ రాష్ట్ర ప్రయోజనాలు వారు చూసుకోవాలని హితవు పలికారు.
    Published by:Nagesh Paina
    First published: