హోమ్ /వార్తలు /National రాజకీయం /

Andhra Pradesh: సీఎం అలా మాట మారుస్తారనుకోలేదు.. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh: సీఎం అలా మాట మారుస్తారనుకోలేదు.. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఫైల్ ఫోటో)

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఫైల్ ఫోటో)

ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక సీఎం అయిన వ్యక్తి.. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట మాట్లాడడం సరికదాన్నారు. అసలు ఆయన ఎందుకు మాట మార్చారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం మాట మారుస్తారని అనుకోలేదని.. అందుకే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం పై మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వ్యవహారం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు హాట్ కామెంట్లు చేసుకుంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారిని.. కానీ ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ రైతులకు నీళ్ల కోసం సహకరిస్తామని చెప్పారని.. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం తనకు నచ్చలేదన్నారు..మాకు ఎంత నీరు కావాలో అంతే తీసుకుంటామని స్పష్టం చేవారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి గురించి కేసీఆర్ అసెంబ్లీలో ఏం మాట్లాడారో అంతా చూశారన్న ఆయన.. తెలంగాణ కూడా వెనక బడి ఉందని.. వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చని సలహా ఇచ్చారు. నిబంధనల ప్రకారం రాష్ట్రం వాట మాత్రమే వాడుకుంటున్నాం అన్నారు. అసలు ఇవన్నీ సమస్య అనుకోవడం లేదన్న ఏపీ మంత్రి… సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కూడా ఉన్నారని. ఆయనకు అన్నీ విషయాలు తెలుసని.. కానీ ఇప్పుడు ఎందుకు ఆయన ఇలాంటి కామెంట్లు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు.

ఇదే వ్యవహారంపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు కూడా ఘాటుగానే స్పందించారు. తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న భాష సంస్కారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించిన ఆయన.. రాయలసీమ జిల్లాలు తాగు నీటి, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతమని గుర్తు చేశారు. హీరోయిజం కోసం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.

ఇదీ చదవండి: వైఎస్ నరరూప రాక్షసుడు.. పీజేఆర్ మృతికి కారణం కాదా? మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రుల వ్యాఖ్యలకు ధీటుగా తెలంగాణ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఆరోజు పాలకులే తెలంగాణ ప్రాంతానికి కరువు సృష్టించారు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఇచ్చిన పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పనుల గురించి మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి- కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల పై తెలంగాణ ప్రజలు ఉద్యమించే సమయం వస్తుంది అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఏనాడు ఆంధ్ర నాయకులు ఆలోచించలేదని. జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలను వైఎస్సార్ దోపిడీ చేశారని మండిపడ్డారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ దివంగంత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నరరూప రాక్షసుడి అని అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Irrigation Projects, Kannababu, Peddireddy Ramachandra Reddy

ఉత్తమ కథలు