నవ్వుల పాలైన విద్యాశాఖమంత్రి.. జనగణమన పాడడం రాదా.. వైరల్ వీడియో

విద్యాశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవాలాల్ ఛౌదరి.. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జాతీయ గీతాలపన సందర్భంగా తప్పులో కాలేశారు. జనగణమన పాడడం రాక.. నోటికొచ్చింది ఆలపిస్తూ.. నవ్వుల పాలయ్యారు.

news18-telugu
Updated: November 19, 2020, 7:41 AM IST
నవ్వుల పాలైన విద్యాశాఖమంత్రి.. జనగణమన పాడడం రాదా.. వైరల్ వీడియో
బీహార్ మంత్రి మేవాలాల్ చౌదరి
  • Share this:
'బీకామ్‌లో ఫిజిక్స్'.. తెలుగురాష్ట్రాల్లో ఈ డైలాగ్ తెలియని వారుండరు. ఓ మాజీ ఎమ్మెల్యే అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణను షేక్ చేశాయి. ఏంటి బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందా..? మీరు చాలా గ్రేట్ అండి బాబు.. అంటూ సోషల్ మీడియాలో జోకుల బాంబులు పేలాయి. బీహార్‌లోనూ అచ్చం ఇలాంటి ఓ రాజకీయ నేత.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఆయన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. విద్యాశాఖ మంత్రంటే.. ఎంతో విద్యావంతుడై ఉంటాడు. ఉన్నత చదువులు చదివి ఉంటాడు అని అందరూ అనుకుంటారు. కానీ చదువుల సంగతి దేవుడెరుగు.. చిన్నపిల్లాడు సైతం గడగడా పాడే.. జాతీయ గీతం కూడా ఆయనకు రాదు. జనగణమన పాడడం రాక ఇబ్బందులు పడ్డారు. ఇష్టానుసారం ఆలపించి.. మన దేశ జాతీయ గీతాన్ని ఖూనీ చేశారు బీహార్ విద్యాశాఖ మంత్రి.


విద్యాశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవాలాల్ ఛౌదరి.. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జాతీయ గీతాలపన సందర్భంగా తప్పులో కాలేశారు. జనగణమన పాడడం రాక.. నోటికొచ్చింది ఆలపిస్తూ.. నవ్వుల పాలయ్యారు. ఆ వీడియోను ఆర్జేడీ పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.



''ఎన్నో అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖమంత్రి మేవాలాల్ చౌదరికి జాతీయ గీతం పాడడం కూడా రాదు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకైమైనా ఉందా? నితీష్‌జీ మీ అంతరాత్మ ఎక్కడ మునిగిపోయింది.'' అంటూ ట్వీట్ చేసింది ఆర్జేడీ. ఆ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. నిజంగా ఇది సిగ్గుచేటని.. విద్యాశాఖ మంత్రికి జాతీయ గీతం పాడడం రాదా.. ? అని మండిపడుతున్నారు.





కాగా, మేవాలాల్ చౌదరిపై ఇప్పటికే ఎన్నో అవినీతి కేసులున్నాయి. గతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీల్లో లెక్చరర్ల నియమకాల్లో అక్రమాలు జరిగాయని.. కోట్ల రూపాయలు చేతులు మారాయని మేవాలాల్‌పై ఆరోపణలున్నాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గతంలో ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఐతే తాజాగా ఏర్పాటైన బీహార్ కొత్త ప్రభుత్వంతో.. మేవాలాల్‌కు మళ్లీ మంత్రి పదవి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: November 19, 2020, 7:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading