రాహుల్ తలపై 'లేజర్ లైట్'...స్నైపర్‌గన్‌తో గురి..కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్రహోంశాఖ కార్యాలయం స్పందించింది. రాహుల్ గాంధీ భద్రతా లోపానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి లేఖను అందుకోలేదని స్పష్టంచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి SPG డైరెక్టర్ కేంద్రానికి వివరణ ఇచ్చారు.

news18-telugu
Updated: April 11, 2019, 5:03 PM IST
రాహుల్ తలపై 'లేజర్ లైట్'...స్నైపర్‌గన్‌తో గురి..కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
రాహుల్ గాంధీ తలపై లేజర్ లైట్
news18-telugu
Updated: April 11, 2019, 5:03 PM IST
లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందంటూ బాంబు పేల్చింది. అమేథీ ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు రాహుల్ గాంధీ తలను స్నైపర్ గన్‌తో టార్గెట్ చేశారని ఆరోపించింది. పలు వీడియోల్లో రాహుల్ తలపై గ్రీన్ కలర్ లేజర్ లైట్ కనిపించిందని ఆ పార్టీ నేతలు కేంద్ర హోంశాఖకు లేఖరాశారు. రాహుల్‌ గాంధీ భద్రతను కేంద్రహోంశాఖ పట్టించుకోడం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, జైరాం రమేశ్, రణ్‌దీప్ సూర్జేవాల సంతకాలున్న ఆ లేఖ ఇప్పుడు దేశరాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

బుధవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన తలపై గ్రీన్ లేజర్ లైట్ కనిపించింది. అది స్నైపర్ గన్ నుంచి వచ్చే లేజర్ లైట్‌ని పోలిఉంది. అమేథీలో వేర్వేరు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం ఏడుసార్లు ఆ కాంతి కనిపించింది. అందులో రెండు సార్లు రాహుల్ తల ఎడమ కణతిపై లైట్ పడింది. ఆయన ప్రాణానికి ముప్పుఉంది. కేంద్రహోంశాఖ భద్రతా లోపం స్పష్టంగా కనబడుతోంది. దీన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలి. రాహుల్ గాంధీకి భద్రతను పెంచాలి.
లేఖలో కాంగ్రెస్
కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్రహోంశాఖ కార్యాలయం స్పందించింది. రాహుల్ గాంధీ భద్రతా లోపానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి లేఖను అందుకోలేదని స్పష్టంచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే SPG డైరెక్టర్ కేంద్రానికి వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్‌ను కవర్ చేసేందుకు పలు ఛానెళ్లకు చెందిన ప్రతినిధులు వచ్చారని..వారిలో ఏఐసీసీ ఫొటోగ్రాఫర్ ఫోన్ నుంచి గ్రీన్ లైట్ వచ్చిందని స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ తలను స్నైపర్ గన్‌తో గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఐతే సాధారణ సెల్‌ఫోన్ నుంచి లేజర్ మాదిరి లైట్ ఎలా వస్తుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. దీనికి వెనక పెద్ద కుట్ర ఉందని.. కేంద్రం దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది.

అమేథీ నియోజకవర్గంలో బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు. నామినేషన్‌కు ముందు అమేథీలో కాంగ్రెస్ పార్టీ మెగా రోడ్ షో నిర్వహించింది. రాహుల్, ప్రియాంక పాల్గొన్న ఈ రోడ్‌షోకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాతున్న సమయంలో రాహుల్ తలపై గ్రీన్ లేజర్ లైట్ కనిపించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై దర్యాప్తుచేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...