దమ్ముంటే నా భర్తతో పెట్టుకోండి.. నాతో మీకెందుకు? : కేంద్రమంత్రికి ఘాటు రిప్లై

తాను ముస్లింగా పుట్టినప్పటికీ.. మొదట భారతీయురాలినే అని, అందుకు గర్విస్తున్నాని టబూ రావు స్పష్టం చేశారు. లౌకికవాద పునాదులపై రూపొందిన భారత రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి ఇక్కడ అన్ని హక్కులు కల్పించిందని గుర్తుచేశారు.

news18-telugu
Updated: January 28, 2019, 6:47 PM IST
దమ్ముంటే నా భర్తతో పెట్టుకోండి.. నాతో మీకెందుకు? : కేంద్రమంత్రికి ఘాటు రిప్లై
అనంత్ కుమార్ హెగ్దే, టబూ రావు ఫైల్ ఫోటో(Image: Facebook)
  • Share this:
కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్దే నిత్యం వివాదాల్లో నానుతూనే ఉన్నారు. ఆదివారం తాజ్‌మహల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. దానిపై కౌంటర్ ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండు రావుపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. వివాదంలోకి ఆయన భార్యను లాగారు. దినేశ్ కుమార్.. 'ఓ ముస్లిం మహిళ వెంటపడ్డ వ్యక్తిగానే నాకు తెలుసు' అంటూ మరో వివాదానికి తెరదీశారు. అనంత్ హెగ్దే వ్యాఖ్యలపై దినేశ్ కుమార్ భార్య టబూ రావ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

నా భర్త దినేశ్ రావును రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ నన్ను టార్గెట్ చేసింది. రాజకీయాలతో సంబంధం లేని నన్ను అనంత్ హెగ్దే అనవసర వివాదంలోకి లాగారు. మీ చీప్ పాలిటిక్స్‌ కోసం నన్నో పావులా వాడుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాను. మీకు దమ్ముంటే.. ఓ గృహిణి చీర వెనకాల దాక్కుని రాళ్లు విసరడం మానేసి.. నా భర్తను రాజకీయంగా ఎదుర్కోండి.
టబూ రావు, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ రావు సతీమణి


తాను ముస్లింగా పుట్టినప్పటికీ.. మొదట భారతీయురాలినే అని, అందుకు గర్విస్తున్నాని టబూ రావు స్పష్టం చేశారు. లౌకికవాద పునాదులపై రూపొందిన భారత రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి ఇక్కడ అన్ని హక్కులు కల్పించిందని గుర్తుచేశారు. అనంత్ హెగ్దేకు తన రిప్లైని ఫేస్‌బుక్‌ ద్వారా టబూ రావ్ పోస్ట్ చేశారు. అయితే తన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అనంత్ హెగ్దే మాత్రం.. తనను బ్లాక్ చేసుకున్నారని పోస్టులో వెల్లడించారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా మరోసారి కర్ణాటక ప్రతిష్టను దెబ్బతీయవద్దని అనంత్ హెగ్దేతో పాటు ఆయన సహచరులకు టబూ రావు విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చదవండి : తాజ్‌మహల్ ముస్లింలు కట్టలేదు.. అదో శివాలయం : కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
First published: January 28, 2019, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading