Home /News /politics /

WAR STILL CONTINUING BETWEEN SEC NIMMAGADDA RAMSEH KUMAR AND GOVERNMENT OF ANDHRA PRADESH GOVERNMENT REJECTED APPOINTMENT OF SEC SECRETARY PRN

SEC vs YSRCP: చల్లారని పంచాయతీ... నిమ్మగడ్డకు మరో షాకిచ్చిన ప్రభుత్వం

ఆదిత్యానాథ్ దాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆదిత్యానాథ్ దాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (ప్రభుత్వానికి (Andhra Pradesh Government), రాష్ట్ర ఎన్నికల సంఘాని (State Election Commission) మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. తొలిదశ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నామినేషన్ల ప్రక్రియ మొదలైనా ఈ రగడ మాత్రం చల్లారడం లేదు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘాని మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. తొలిదశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైనా ఈ రగడ మాత్రం చల్లారడం లేదు. అధికారుల బదిలీ వ్యవహారంలో నిమ్మగడ్డపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం.., మరోసారి ఆయన ఆదేశాలను పక్కనబెట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపారు. కానీ నిమ్మగడ్డ ఆదేశాలను పక్కనబెట్టిన ప్రభుత్వం కాసేపటికే ఆయన్ను వైద్య ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా నియమించింది. ఆయనకు కొవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యతలు అప్పగించింది. ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖలో ఎక్స్ కేడర్ కార్యదర్శి పోస్టును సృష్టించి మరీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.

    ప్రస్తుతం ముద్దాడ రవిచంద్రకు ఎలాంటి పోస్టింగ్ లేదు. గతంలో ప్రభుత్వం ఆయన్ను జీఏడీకి అటాచ్ చేయడంతో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగూ ఆయనకు పోస్టింగ్ లేదు కాబట్టి.. ఎన్నికల సంఘం కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. కానీ ప్రభుత్వం ట్విస్ట్ ఇస్తూ  రవిచంద్రకు వేరే పోస్టింగ్ ఇచ్చింది. ఆతే ఎన్నికల సంఘం కార్యదర్శి పోస్టుకు ప్రతిపాదనలు పంపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారులైన విజయ్ కుమార్, రాజబాబు, కన్నబాబుల పేర్లను పంపింది.

    కొన్ని రోజుల క్రితం ఎస్ఈసీకి కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్ ను నిమ్మగడ్డ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తరుణంలో కార్యదర్శి అవసరం ఏర్పడింది. సెక్రటరీ పోస్టును భర్తీ చేసేందుకు ముగ్గురు అధికారులతో కూడిన జాబితాను పంపాల్సిందిగా ప్రభుత్వానికి రెండుసార్లు లేఖరాసినా స్పందించకపోవడంతో ముద్దాడ రవిచంద్రను కార్యదర్శిగా నియమించినట్లు రమేష్ కుమార్ పేర్కొన్నారు.

    ఐతే అధికారుల బదలీ వ్యవాహంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను.., ప్రభుత్వం తిప్పి పంపిస్తూనే ఉంది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీతో పాటు పలువురు అధికారుల బదిలీలను ఓకే చేసిన ప్రభుత్వం.., పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, కమీషనర్ గిరిజా శంకర్ అభిశంసనను మాత్రం వెనక్కిపంపింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ కార్యదర్శి పోస్టింగ్ వ్యవహారం మరో వివాదానికి తెరతీసింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Adityanath Das, Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections, IAS, Local body elections, Nimmagadda Ramesh Kumar, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు