YCP-TDP Fight: “ఓ మై సన్ అనడం తప్పా..” విమర్శలకు అయ్యన్న కౌంటర్.. ఎక్కడా తగ్గని వైసీపీ..

వైసీపీ-టీడీపీ మధ్య ముదిరిన మాటల యుద్ధం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. ఈ వ్యవహారం ఇరుపార్టీల నేతలు ఘర్షణకు దిగేలా చేసింది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు అయ్యన్న కౌంటర్ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని (AP CM YS Jagan Mohan Reddy) అసభ్య పదజాలంతో దూషించలేదని స్పష్టం చేశారు. “చర్చిలో ఫాదర్ మాదిరిగా ఓ మై సన్” అని మాత్రమే సంబోధించానని తనదైన స్టైల్లో వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కేబినెట్లో మంత్రులు మాట్లాడుతున్న మాటలనే చెప్పాను తప్ప హద్దులు దాటలేదన్నారు. మాజీ సీఎం చంద్రబాబు (Nara Chandra Babu Naidu) ఇంటిపై వైసీపీ నేతలుద దాడికి యత్నించడం సరికాదన్నారు.

  ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి చేయడం పద్ధతికాదన్న ఆయన.. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతున్న మాటలే చెప్పాను తప్ప ముఖ్యమంత్రిని తిట్టలేదని.. తన మాటల్లో తిట్లు ఎక్కడున్నాయో చూపాలని అయ్యన్న వైసీపీకి సవాల్ విసిరారు.

  ఇది చదవండి: నేతన్న అవతారమెత్తిన ఎమ్మెల్యే రోజా.. ఆమె నేసిన చీరలో స్పెషాలిటీ ఇదే..!


  ఇది ఆంధ్రానా..? ఆఫ్ఘనిస్తానా..?: అచ్చెన్న
  ఉండవల్లిలో చంద్రబాబు నివాసం దగ్గర జరిగిన ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (TDP State President Atchennaidu) స్పందించాడు. సీఎం జగన్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా మార్చేశారని మండిపడ్డారు. జోగి రమేష్  (Jogi Ramesh) ఎమ్మెల్యేనా.. లేక రౌడీనా అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంగా వెళ్తున్న తమను గృహనిర్బంధాలు చేస్తున్న పోలీసులు.. ముందుగా హెచ్చరించి వెళ్తున్న జోగి రమేష్ ను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.

  ఇది చదవండి: కౌంటింగ్ పై ఎస్ఈసీ, సీఎస్ సమీక్ష... కలెక్టర్లకు కీలక ఆదేశాలు..


  వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్..
  ఉండవల్లిలో జరిగిన వ్యవహారంపై అధికార పార్టీ నేతలు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యేపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు తన పార్టీ నేతలను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని ఆరోపించారు. అంతేకాదు పరిషత్ ఎన్నికల లెక్కింపుపై హైకోర్టు తీర్పుపై ప్రజల దృష్టిని మరల్చేందుకు పన్నిన కుట్ర అని మండిపడ్డారు. టీడీపి నేతలను చంద్రబాబే రెచ్చగొట్టి ముఖ్యమంత్రిని, వైసీపీ నేతలను బూతులు తిట్టిస్తున్నాని.. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

  ఇది చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక ప్రకటన.. భక్తులకు నో ఎంట్రీ..!


  ఉండవల్లిలో ఉద్రిక్తత...
  గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వైసీపీ నేతలను మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో పాటు పలువురు నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ దశలో జోగి రమేష్- బుద్ధా వెంకన్న మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను అదుపుచేసి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు.
  Published by:Purna Chandra
  First published: