Home /News /politics /

WAR OF WORDS BETWEEN YSRCP AND BJP AS MINISTER PERNI NANI SLAMS BJP ON PETRON PRICES FULL DETAILS HERE PRN

AP Politics: ఒక సభ.. మూడు పార్టీలు.. బీజేపీ జనాగ్రహ సభతో వేడెక్కిన రాజకీయం.. పేలుతున్న మాటల తూటాలు..

బీజేపీ జనాగ్రహదీక్షపై వైసీపీ, టీడీపీ ఫైర్

బీజేపీ జనాగ్రహదీక్షపై వైసీపీ, టీడీపీ ఫైర్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. విజయవాడ (Vijayawada) లో బీజేపీ (BJP) ఏర్పాటు చేసిన జనాగ్రహ సభపై వైసీపీ (YSRCP), బీజేపీ, టీడీపీ (TDP) ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జనాగ్రహ సభపై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలకు బీజేపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. విజయవాడ (Vijayawada) లో బీజేపీ (BJP) ఏర్పాటు చేసిన జనాగ్రహ సభపై వైసీపీ (YSRCP), బీజేపీ, టీడీపీ (TDP) ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జనాగ్రహ సభపై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలకు బీజేపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మధ్యలో టీడీపీ కూడా ఎంటరవడంతో సీన్ మరింత రంజుగా మారింది. ఏపీలో అభివృద్ధి లేదని బీజేపీ ఆరోపిస్తుంటే.. వారి దమ్ముంటే నిత్యావసరాలు, పెట్రోల్ ధరలపై మాట్లాడలని వైసీపీ సవాల్ విసిరుతోంది. మధ్యలో ఎంటరైన టీడీపీ.. వైసీపీని ఏమీ చేయలేని బీజేపీ.. జగన్ అనుగ్రహం కోసమే సభలు నిర్వహిస్తోందని ఆరోపించింది. ఒక సభపై మూడు పార్టీలు మాటల యుద్ధానికి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    బీజేపీ సభపై మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. వైసీపీ వైఫల్యాలంటూ అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ముందుగా నిత్యావసరాలు, పెట్రోల్ ధరలపై మాట్లాడే దమ్ముందా అని ప్రశ్నించారు. ఏపీ బీజేపీని సీఎం రమేష్, సుజనా చౌదరికి లీజుకిచ్చారని ఆరోపించారు. వాళ్లే ఇక్కడ పార్టీ కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. పార్టీని లీజుకు తీసుకున్నామన్న ధైర్యంతోనే ఇద్దరు ఎంపీలు ధీమాగా మాట్లాడుతున్నారని.. ఏకంగా అమిత్ షా చేయాల్సిన ప్రకటనలు కూడా వాళ్లిద్దరే చేస్తున్నారన్నారు. ఏపీని కేంద్రం టెలిస్కోప్ లో చూస్తోందంటే ఢిల్లీకి ఏపీకి ఎంత దూరముందో అర్ధమవుతోందన్నారు. ఐపీఎస్ అధికారులను రీకాల్ చేసే అధికారం వీరికి ఎవరిచ్చారని పేర్ని ప్రశ్నించారు.

    ఇది చదవండి: బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు.. కారణం ఇదే..!


    పేర్ని నాని కామెంట్స్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. వైసీపీనే పార్టీని అమ్ముకుంటోందని ఆయన ఆరోపించారు. కొంతమందికి రాజ్యసభ ఎంపీ పదవులిచ్చి పార్టీని కూడా జిల్లాల వారీగా అమ్మేశారని మండిపడ్డారు. బీజేపీలో అలాంటి పరిస్థితి లేదని ప్రజల కోసమే తాను పనిచేస్తామన్నారు. పార్టీని లీజుకిచ్చామన్న మంత్రి పేర్ని నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

    ఇది చదవండి: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ..? కాపు నేతల సీక్రెట్ మీటింగ్ వెనుక కారణం ఇదేనా..?


    ఇదిలా ఉంటే బీజేపీ, వైసీపీ వార్ లో టీడీపీ కూడా ఎంటర్ అయింది. ఏపీలో బీజేపీ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ వేరు.. ఏపీలో ఉన్న బీజేపీ వేరన్న పయ్యావుల.. జాతీయ స్థాయిలో బీజేపీని ప్రధాని నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్ షా నడిపిస్తుంటే.. ఏపీలో మాత్రం బీజేపీ జగన్ డైరెక్షన్లో నడుస్తోందని ఆరోపించారు. బీజేపీ నిర్వహించేది జనాగ్రహ సభ కాదని.. జగన్ అనుగ్రహ సభని పయ్యావుల ఎద్దేవా చేశారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, Tdp, Ysrcp

    తదుపరి వార్తలు