‘హోదా’ వార్… ఆ ఏడు నెలలు ఏం చేశారన్న జగన్... అందుకే మీకు ఓట్లు వేశారన్న చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం... రాష్ట్రానికి హోదా రాకపోవడానికి కారణం గత చంద్రబాబు ప్రభుత్వమే అని విమర్శించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

news18-telugu
Updated: June 18, 2019, 3:44 PM IST
‘హోదా’ వార్… ఆ ఏడు నెలలు ఏం చేశారన్న జగన్... అందుకే మీకు ఓట్లు వేశారన్న చంద్రబాబు
చంద్రబాబు, వైఎస్ జగన్(ఫైల్ ఫోటోలు)
news18-telugu
Updated: June 18, 2019, 3:44 PM IST
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి. ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం... రాష్ట్రానికి హోదా రాకపోవడానికి కారణం గత చంద్రబాబు ప్రభుత్వమే అని విమర్శించింది. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య సంవాదం నడిచింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ప్లానింగ్ కమిషన్ ఉన్న సమయంలో కనీసం ఒక లేఖ కూడా రాయలేదని సీఎం జగన్ విమర్శించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఏడు నెలల పాటు ప్లానింగ్ కమిషన్ మనుగడలో ఉందన్న సీఎం జగన్... అప్పుడు ఆయన కనీసం హోదా అమలు కోసం ప్రయత్నం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. దీన్నిబట్టి చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. గత ఐదేళ్లలో టీడీపీ రాష్ట్రాన్ని ప్రజలను దోచుకుందని జగన్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని... ఇందుకోసం చిత్తశుద్ధితో పని చేస్తామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

మరోవైపు టీడీపీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు కూడా అదే స్థాయిలో స్పందించారు. హోదా కోసం పోరాటం చేశామని... రాష్ట్రం కోసం రాజకీయంగా నష్టపోయేందుకు కూడా సిద్ధమయ్యామని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాను 29 సార్లు ఢిల్లీ వెళ్లానని అన్నారు. ప్రజలు ప్రత్యేక హోదా సాధిస్తారనే నమ్మకంతోనే 22 ఎంపీలను ఇచ్చారన్న చంద్రబాబు... మీరు అందుకోసం పోరాటం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదాతో సమానమైన సాయం చేస్తామని అంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం చేసే ఏ పనికైనా తమ మద్దతు ఉంటుందని చంద్రబాబు తెలిపారు.First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...