ఆర్టీసీ సమ్మె... కేసీఆర్ వర్సెస్ కోదండరామ్‌ ?

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టాలని కోదండరాం ప్రయత్నించారని... ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన సీఎం కేసీఆర్... వారిని పిలిచి చర్చలు జరిపారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: October 11, 2019, 3:13 PM IST
ఆర్టీసీ సమ్మె... కేసీఆర్ వర్సెస్ కోదండరామ్‌ ?
కోదండరాం, కేసీఆర్
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రంగా సాగుతోంది. సమ్మె విషయంలో అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సమ్మెకు విరుగుడుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. తమ సమ్మెకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టాలని ఆర్టీసీ జేఏసీ భావిస్తోంది. ఆర్టీసీ జేఏసీ, సీఎం కేసీఆర్ మధ్య సాగుతున్న ఈ కోల్డ్ వార్ కాస్త కేసీఆర్ వర్సెస్ కోదండరామ్‌గా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీని సమన్వయపరుస్తు ముందుకు సాగుతున్నది కోదండరామే కావడం విశేషం.

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టాలని కోదండరాం ప్రయత్నించారని... ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన సీఎం కేసీఆర్... వారిని పిలిచి చర్చలు జరిపారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌తో పాటు బీజేపీ మద్దతును కూడగట్టడంతో పాటు ఇతర పార్టీల సపోర్ట్ కూడా రావడంతో కోదండరాం కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె సమయంలో ఉద్యమాన్ని ఎక్కువ రోజులు కొనసాగించేలా వ్యూహరచన చేసిన కోదండరాం... ఈ సారి తన అనుభవాన్ని ఆర్టీసీ కార్మికుల సమ్మె కోసం వినియోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కోదండరాం రంగంలోకి దిగాడని తెలిసిన తరువాతే... సీఎం కేసీఆర్ కూడా ఈ మొత్తం అంశాన్ని సీరియస్‌గా తీసుకుని తన రాజకీయవ్యూహాలకు పదునుపెట్టారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మరోసారి కేసీఆర్ వర్సెస్ కోదండరాం అన్నట్టుగా ఉందని పలువురు భావిస్తున్నారు.





First published: October 11, 2019, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading