రోజా, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై బూతు కామెంట్స్‌తో పోస్టులు... వ్యక్తి అరెస్ట్

వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు మరో ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి నిందితుడు అసభ్యకర పోస్ట్ చేశాడు.

news18-telugu
Updated: August 15, 2019, 7:27 PM IST
రోజా, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై బూతు కామెంట్స్‌తో పోస్టులు... వ్యక్తి అరెస్ట్
ఏపీ అసెంబ్లీలో రోజా
  • Share this:
వైసీపీ మహిళా ఎమ్మెల్యేల మీద అభ్యంతరకర వ్యాఖ్యలతో ఫేస్ బుక్‌ పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఉన్న ఓ ఫొటోను తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన పునుగుపాటి రమేష్ అనే వ్యక్తి దానిపై ‘ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రెడ్ లైట్ ఏరియాగా మార్చారు కదరా!’ అని కామెంట్ చేశాడు. మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ బూతుపదాలతో కామెంట్స్ చేయడం ద్వారా వారి ప్రతిష్టకు భంగం కలిగించారంటూ పునుగుపాటి రమేష్‌పనై ఏపీ అసెంబ్లీ సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిందితుడు ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురానికి చెందిన వాడిగా గుర్తించారు. అయితే, పోలీసులు తన కోసం వెతుకుతున్న విషయాన్ని తెలుసుకున్న రమేష్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, సాంకేతిక పరిజ్ఞానం, నిందితుడి ఐఎంఈఐ నెంబర్ సాయంతో పట్టుకోవడానికి వెళ్లారు. నిందితుడు రమేష్ నెల్లూరు పారిపోయాడు. ఆ తర్వాత కోయంబత్తూర్ వెళ్లాడు. అక్కడి నుంచి బెంగళూరులో తలదాచుకున్నాడు. ప్రతి సారీ లాడ్జిలు, మంచాలు అద్దెకు తీసుకుని ఒక్క రోజులోనే మకాం మార్చేసేవాడు. సుమారు 30 సిమ్ కార్డులు మార్చాడు. అయితే, మొత్తం ఆరు బృందాలు అతడిని వెంటాడాయి. ఈ క్రమంలో బెంగళూరు నుంచి పారిపోతుండగా పట్టుకున్నారు.
First published: August 15, 2019, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading