కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉగ్రవాదులకు ఓటేసినట్లేనని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులకు కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ పొట్లాలను అందిస్తే బిజెపి ప్రభుత్వం బుల్లెట్లతో సమాధానం చెప్పిందన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని విమర్శించారు యోగి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దేశవ్యతిరేకశక్తులతో చేతులు కలిపాయని..ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన యోగి ఆదిత్యనాథ్.. సోగాల కుమార్‌ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
రామగుండంలో మూసివేసిన ఎరువుల ఫ్యాక్టరీని రూ.5500 కోట్లతో తెరిపించిన ఘనత బీజేపీదే. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వాదులకు బిర్యానీ పొట్లాలను అందిస్తే బిజెపి బుల్లెట్లతో సమాధానం చెప్పింది. టీఆరెస్ కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్లే. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తీవ్రవాదులకు ఓటేసినట్లే. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మకయ్యాయి. టీఆర్ఎస్ ఐదేళ్ల పాలనను చూస్తే నిజాంపాలన గుర్తుకొస్తోంది. ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలుచేయలేదు. సబ్కా సాథ్..సబ్కా వికాస్ నినాదంతో బీజేపీ ముందుకెళ్తోంది.
— యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం
అంతకుముందు పెద్దపల్లి ప్రజలకు తెలుగులో వికారినామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు యోగి ఆదిత్యనాథ్. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాపోలు ఆనంద్ భాస్కర్,రాష్ర్ట అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. బీజేపీ విజయసంకల్ప సభకు భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.