Home /News /politics /

VOTERS HEADING FOR POLLING CENTERS TO CAST THEIR VOTES DURING FOURTH PHASE PANCHAYAT ELECTIONS IN ANDHRA PRADESH PRN

AP Pancahyat Elections: 3 గంటల్లో 72శాతం పోలింగ్... పంచాయతీ ఎన్నికల్లో రికార్డు..

ఏపీలో కొనసాగుతున్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఏపీలో కొనసాగుతున్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) నాలుగో విడత పంచాయతీ ( AP Panchayat Elections)ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

    ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పల్లెపోరులో ఇవే చివరిదశ ఎన్నికలు కావడంతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ కొనసాగుతోంది. ఆనందపురం మండలం ముకుందాపురం గ్రామ పంచాయతీలో కేవలం 3గంటల్లోనే 72శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామస్తులు భారీగా తరలిరావడంతో రికార్డుస్థాయి పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓట్లు వేసేందుకు స్థానికులు పోటీపడటంపై అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాలుగో దశ పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు కుర్చీలతో కొట్టుకున్నారు. ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

    గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు ఎస్సీకాలనీలోని పోలింగ్ బూత్ వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుసుకుంది. పోలింగ్ బూత్ లో ప్రవేశించడంపై ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో వివాదం ముదిరింది. పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపేశారు.  ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో క్యూలైన్ల వద్ద వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఘర్షణకుదిగడంతో పోలీసులు వారిని పంపేశారు. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలోని పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగఓట్లు వేస్తున్నారంటూ కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

    ఇది చదవండి: ఏపీలో కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు


    కృష్ణాజిల్లా ఉంగుటూరు మండల కేంద్రంలో కలకలం చోటు చేసుకుంది. వద్ధదంపతులతో ఓట్లు వేయించేందుకు బయటి వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి రావడంపై ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్లులో ఓ వృద్ధురాలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వృద్ధురాలు ఓటు వేసేందుకు రాగా.. అప్పటికే ఆమె ఓటు నమోదైనట్లు అధికారులు చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపేరిట వేరే వ్యక్తి ఓటు వేయడమేంటని ఆమె అధికారులను నిలదీశారు. అనంతపురం జిల్లాలో నందమూరి బాలకృష్ణ ప్రాతనిథ్యం వహిస్తున్న హిందూపురం మండలం బేవన్నహళ్లిలో సర్పంచ్ అభ్యర్థి భాగ్యమ్మ పోలింగ్ కేంద్రంలోనే స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP News, Gram Panchayat Elections, Local body elections, Telugu news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు