Home /News /politics /

VOTE ON ACCOUNT BUDGET TO BE INTRODUCED IN AP ASSEMBLY ON FEB 5TH MS

ఇవాళే ఏపీ బడ్జెట్.. ఈసారి 2లక్షల కోట్ల పైనే..

చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు(File)

చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు(File)

ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం ఉదయం 11.45గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

    ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు ఉదయం 11.45గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ ప్రవేశపెడుతారు. గతేడాది బడ్జెట్‌ రూ.1,93,000కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈసారి బడ్జెట్ 2.25 లక్షల కోట్ల మేర ఉండే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

    ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. బడ్జెట్‌లో ప్రజాకర్షక తాయిలాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వబోతున్నట్టు తెలుస్తోంది. రైతులకు వరాలు కురిపించడంతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేయబోతున్నట్టు సమాచారం. కాగా, జనవరి 30న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Tdp, Yanamala Rama Krishnudu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు