• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • VK SASIKALA RELEASED FROM BENGALURU JAIL AFTER 4 YEARS SK

Sasikala: చిన్నమ్మకు విడుదల.. నాలుగేళ్ల తర్వాత జైలు నుంచి శశికళ రిలీజ్

Sasikala: చిన్నమ్మకు విడుదల.. నాలుగేళ్ల తర్వాత జైలు నుంచి శశికళ రిలీజ్

శశికళ

Sasikala: శశికళ జైలు నుంచి విడుదల కావడంతో.. ఒకవేళ ఆమెను వేరొక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తే వెళ్లిపోవచ్చు. మరి శశికళ బెంగళూరు ఆస్పత్రిలోనే ఉంటారా? లేదంటే చెన్నైకి వెళ్లిపోతారా? అనేది తెలియాల్సి ఉంది.

  • Share this:
    తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. 4 ఏళ్ల జైలు శిక్ష పూర్తవడంతో ఆమెను విడుదల చేశారు. శశికల రిలీజ్‌కు సంబంధించి అన్ని ఫార్మాలిటీలు పూర్తయ్యాయని ఆమె లాయర్ రాజా సెంథూర్ పాండియన్ చెప్పారు. కోర్టు ఆదేశించినట్లుగా రూ.10కోట్ల జరిమానాను కట్టామని తెలిపారు. ఐతే డాక్టర్ల సలహా మేరకు శశికళ ఆస్పత్రిలోనే ఉంటారని ఆక్ష్న వెల్లడించారు. శశికళకు జనవరి 20న ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నెగెటివ్ వచ్చింది. మరో టెస్ట్‌లో మాత్రం మళ్లీ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె విక్టోరియా ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జైలు నుంచి విడుదల అయినప్పటికీ..కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం మరికొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలి.


    శశికళ విడుదల నేపథ్యంలో ఆమె అనచురులు, అభిమానులు పెద్ద ఎత్తున విక్టోరియా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. AMMK జెండాలతో సందడి చేశారు. ఇక శశికళ హెల్త్ బులెటిన్‌ను డాక్టర్లు విడుదల చేశారు. ప్రస్తుతానికి ఆమెకు కరోనా లక్షణాలేవీ.. ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. నోటి నుంచి ఆహారం తీసుకుంటున్నాని, ఇతరుల సపోర్ట్‌గా నడుస్తున్నారని వెల్లడించారు. శశికళ జైలు నుంచి విడుదల కావడంతో.. ఒకవేళ ఆమెను వేరొక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తే వెళ్లిపోవచ్చు. మరి శశికళ బెంగళూరు ఆస్పత్రిలోనే ఉంటారా? లేదంటే చెన్నైకి వెళ్లిపోతారా? అనేది తెలియాల్సి ఉంది.

    రూ. 66 కోట్ల అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలడంతో జైలుపాలయ్యారు. ఆ కేసులో నాలుగేళ్ల జైలు శిక్షపడింది. 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో శశికళ బంధువులు జే ఇళవరసి, బీ ఎన్ సుధాకర్‌కు కూడా శిక్షపడింది. ఇళవరసిికి కూడా కరోనా సోకింది. కానీ ఎలాంటి లక్షణాలు లేవు. ఆమెను ఫిబ్రవరి మొదటి వారంలో జైలు నుంచి విడుదల చేస్తారు. ఐతే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సమయంలోనే శశికళ జైలు నుంచి విడుదలయిన నేపథ్యంలో.. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
    Published by:Shiva Kumar Addula
    First published: