• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • VK SASIKALA FORMALLY QUITS PUBLIC LIFE POLITICS ISSUES STATEMENT CALLING FOR AMMA CADRES TO UNITE AGAINST DMK BA

Sasikala: శశికళ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై..

Sasikala: శశికళ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై..

శశికళ(ఫైల్ ఫొటో)

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిన్నమ్మ శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజాజీవితానికి గుడ్ బై చెప్పారు. తాను రాజకీయాలకు రావడం లేదని చెప్పారు.

  • Share this:
    తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిన్నమ్మ శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజాజీవితానికి గుడ్ బై చెప్పారు. తాను రాజకీయాలకు రావడం లేదని చెప్పారు. తనకు పదవుల మీద, అధికారం మీద ముందు నుంచి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. అమ్మ జయలలిత అభిమానులు అందరూ ఏకమై డీఎంకేను ఓడించాలని శశికళ పిలుపునిచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నమ్మ పాత్ర  ఎలా ఉంటుందనే అంశంపై ఇటీవల పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి.  అన్నాడీఎంకేను మళ్లీ ఆమె కైవసం చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సొంతంగా AMMK పార్టీని పెట్టారు. ఆయన జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అవినీతి కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్నమ్మ ఆ పార్టీని ముందుండి నడిపిస్తారని, అన్నాడీఎంకే నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని భావించారు.

    నేనెప్పుడు అధికారం కోసం, పదవుల కోసం పాకులాడలేదు. అమ్మ (జయలలిత) కేడర్ అంతా ఒక్కటై దెయ్యం లాంటి డీఎంకేను ఓడించాలి. మళ్లీ అమ్మ బంగారు పాలనను తమిళనాట తీసుకురావాలి
    శశికళ


    AMMK పార్టీని కూడా అన్నాడీఎంకేలో విలీనం చేసుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పన్నీర్ సెల్వం మీద కేంద్రంలోని అధికార బీజేపీ ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరిగింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాలో వారు సమావేశం అయ్యారు. తమిళనాడులో అన్నాడీఎంకే - బీజేపీ కూటమి గెలవాలంటే చిన్నమ్మ పార్టీని కూడా విలీనం చేసుకోవాలని అమిత్ షా ఒత్తిడి చేశారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను తమిళనాడు మంత్రి జయకుమార్ ఖండించారు. ‘మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేదు. మా పార్టీ అంతర్గత విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు. ఇంతకుముందే సీఎం చెప్పినట్టు ఏఎంఎంకే పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేసే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇది మా కచ్చితమైన నిర్ణయం. అమిత్ షాతో సమావేశంలో విలీనం గురించి చర్చించినట్టు మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. ఏఎంఎంకేలో గుంటనక్కలు ఉన్నాయి. అన్నాడీఎంకేలో సింహాలు ఉన్నాయి. ఇక అన్నాడీఎంకే, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు సుజావుగా జరుగుతుంది. దీనిపై త్వరలో నిర్ణయానికి వస్తాం.’ అని జయకుమార్ స్పష్టం చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు